Niharika | వరుణ్ తేజ్- లావణ్య ప్రేమ గురించి నిహారిక షాకింగ్ కామెంట్స్.. ఆ పార్టీలోనే తెలిసింది..
Niharika | మెగా డాటర్, నిర్మాత నిహారిక కొణిదెల తాజాగా తన అన్నయ్య, నటుడు వరుణ్ తేజ్ ప్రేమ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి తనకు చాలా ఆలస్యంగా తెలిసిందని, అది కూడా ఓ పార్టీలో వారిద్దరినీ చూసిన తర్వాతే అనుమానం వచ్చిందని ఆమె వెల్లడించారు.
Niharika | మెగా డాటర్, నిర్మాత నిహారిక కొణిదెల తాజాగా తన అన్నయ్య, నటుడు వరుణ్ తేజ్ ప్రేమ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి తనకు చాలా ఆలస్యంగా తెలిసిందని, అది కూడా ఓ పార్టీలో వారిద్దరినీ చూసిన తర్వాతే అనుమానం వచ్చిందని ఆమె వెల్లడించారు.
తాను నిర్మాతగా వ్యవహరించిన ‘రాకాస’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక ఈ విషయాలను పంచుకున్నారు. కుటుంబానికి దగ్గరగా ఉన్నప్పటికీ, ఈ లవ్ స్టోరీ గురించి ముందుగా తెలియలేదని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఇంట్రోవర్ట్ కాదు..
నిహారిక మాట్లాడుతూ, “అందరూ మా అన్నయ్యను ఇంట్రోవర్ట్ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వాడు చాలా సరదాగా ఉండే వ్యక్తి. కొంచెం రౌడీ కూడా… నన్ను బాగా ఏడిపిస్తాడు” అంటూ నవ్వుతూ చెప్పారు. ఇండస్ట్రీలో వరుణ్ తేజ్‌కు స్నేహితులు తక్కువగా ఉండటంతో, లావణ్యతో అతని ప్రేమ వ్యవహారం చాలా కాలం రహస్యంగా కొనసాగిందని వెల్లడించారు.
ఒకసారి వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలకు లావణ్య త్రిపాఠి హాజరుకావడం తనకు అనుమానం కలిగించిందని నిహారిక చెప్పారు. “మా అన్నయ్య ఎవరినీ పార్టీలకు పిలవడు. అలాంటి వ్యక్తి బర్త్‌డేకు లావణ్య రావడంతో అప్పుడే వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని అర్థమైంది” అని ఆమె వివరించారు.
తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటా..
ఇక ఇదే ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై కూడా నిహారిక స్పందించారు. “మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?” అనే ప్రశ్నకు సమాధానంగా, తాను తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటానని, అయితే ప్రస్తుతం మాత్రం ఆ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం లేదని స్పష్టం చేశారు. తన కెరీర్‌పై ప్రస్తుతం ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
మొత్తానికి, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమ కథపై నిహారిక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ విషయాలను సరదాగా పంచుకుంటూ ఆమె ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram