వరుణ్ తేజ్, రితీక నాయక్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొరియన్ కనకరాజు సినిమా ఈ నెల 7న విడుదల కానున్న నేపథ్యంలో సినిమా బృందం ప్రమోషన్ లో జోరు పెంచింది. ఇప్పటికే విడుదలైన కొరియన్ కనకరాజు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో…సినిమాపై అంచనాలు పెంచేసింది. హర్రర్, కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మితమవుతున్న ఈ సినిమాలో హాస్య నటుడు సత్య కీలక పాత్రలో సందడి చేయనున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా హీరోహీరోయిన్లు వరుణ్ తేజ్, రీతిక, నటుడు సత్యలు ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఈ నెల 7న కొరియన్ కనకరాజు సినిమా విడుదలవుతుందంటూ నవరసాల నటన డైలాగ్ లతో చెప్పి హాస్యాన్ని పండించే ప్రయత్నం చేస్తూ సినిమా విడుదల ప్రమోషన్ చేశారు.
మరో వీడియోతో తన మేన బావ వరుణ్ కోసం సాయి ధరమ్ తేజ్ రంగంలోకి దిగి ..కొరియన్ కనకరాజు సినిమా కోసం తనవంతు ప్రమోషన్ చేశాడు. ఎంది దెయ్యాలు..నేను విరూపాక్ష సినిమాలో దెయ్యాన్ని లవ్ చేశాను తెలుసా.. తొక్కలో దెయ్యాలు ఏంట్రా’’ అని అంటూనే..భయభయంగా కొరియన్ భూతం ఉన్న సీసా మూతను తెరిచే భయంతో షాక్ అవుతాడు. వెంటనే అతని కళ్లు బ్లూ కలర్ లోకి మారిపోతాయి. ఇలా కొరియన్ కనకరాజు మూవీ కోసం సాయి ధరమ్ తేజ్ సైతం ను ఓ వీడియోలో కనిపించాడు. మొత్తంగా సినిమా కోసం నటినటులు అంతా తమదైన వీడియోలను వదులుతూ ప్రమోషన్ డోస్ పెంచడం విశేషం. వరుస సినిమాల ఫెయిల్యూర్ తో నిరాశలో ఉన్న వరుణ్ తేజ్ ఈ దఫా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కామెడీ హర్రర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
కొరియన్ కనకరాజు ఆగస్టు 7 న వస్తున్నాడు…
ఈ మాట చెప్పడానికి ఎన్ని వేరియేషన్స్ వాడారో చూడండి..
నవరసాల్ని ఉతికి.. పిండి… ఆరేశారు🤗 pic.twitter.com/xRlFgzdPAh
— Telugu360 (@Telugu360) August 4, 2026