Lavanya Tripathi | లావణ్యకి కోపం వచ్చింది.. రిపోర్టర్‌కి గట్టిగా ఇచ్చి పడేసిందిగా..!
Lavanya Tripathi | మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం ఆనందానికి అవధులు లేవు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కావడంతో వారి ఇంట్లో సంతోషం రెట్టింపైంది. జనవరి 31న ఈ దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో మెగా కుటుంబంతో పాటు అభిమానుల్లోనూ ఉత్సాహం నెలకొంది.
Lavanya Tripathi | మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం ఆనందానికి అవధులు లేవు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కావడంతో వారి ఇంట్లో సంతోషం రెట్టింపైంది. జనవరి 31న ఈ దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో మెగా కుటుంబంతో పాటు అభిమానుల్లోనూ ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే చరణ్, ఉపాసనలకు క్లీంకార అనే కుమార్తె ఉండగా ఇప్పుడు మరోసారి పిల్లల రాకతో కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కవలల రాకను మెగా ఫ్యాన్స్ ఒక సెలబ్రేషన్‌లా జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా మెగా కుటుంబంలో వారసుడు రావడంతో గతంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ నెగిటివ్ కామెంట్స్‌కు మెగా కోడలు, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించారు. ఒక జర్నలిస్టు చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ సాధారణంగా తాను ఇలాంటి విషయాలను పట్టించుకోనని, కానీ ఓ జర్నలిస్టు నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు.
ఒక సంతోషకరమైన సందర్భాన్ని చెడగొట్టేలా కామెంట్స్ చేయడం సరైంది కాదని, చిరంజీవి తన కుటుంబంలోని మహిళలకు ఎంత గౌరవం ఇస్తారో అందరికీ తెలుసని, ఆయన చేసే మంచి పనుల్లో ఇతరులు ఒక శాతం కూడా చేయలేరని పేర్కొన్నారు. తెలియని విషయాలపై కామెంట్ చేయకపోవడమే మంచిదని సూచించడంతో ఆ జర్నలిస్టు తన ట్వీట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. లావణ్య వ్యాఖ్యలతో మెగా అభిమానులు ఆమెకు మద్దతు తెలిపారు. చిరంజీవి మహిళలకు ఇచ్చే గౌరవం గురించి కుటుంబ సభ్యులే అనేక సందర్భాల్లో వెల్లడించారని, అలాంటి వ్యక్తిని వారసత్వం విషయంలో విమర్శించడం సరికాదని ఫ్యాన్స్ అంటున్నారు.
కాగా గతంలో ఒక సందర్భంలో చిరంజీవి ఇంట్లో ఎటు చూసినా మహిళలే ఉన్నారని సరదాగా వ్యాఖ్యానిస్తూ మనవడు ఉంటే బాగుంటుందనడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఆ వ్యాఖ్యలను ఇప్పుడు మరోసారి బయటకు తీసుకొస్తూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నా, కుటుంబంలో మాత్రం కొత్త సభ్యుల రాకతో ఆనందం మాత్రమే కనిపిస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram