Sunrisers Leeds X Account Suspended | సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కావ్య పాపకు ఎక్స్ షాక్ !

‘ ది హండ్రెడ్‌ 2026’ టోర్నీకి పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ ను వేలంలో రూ.2.34 కోట్లకు కొనుగోలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్‌ లీడ్స్‌ జట్టు ఫ్రాంచైజీకి మరో షాక్ తగిలింది. కావ్య మారన్ కు చెందిన సన్ రైజర్స్ లీడ్స్ ఎక్స్ అకౌంట్ సస్పెండ్ కు గురైంది.

Sunrisers Leeds X Account Suspended

విధాత, హైదరాబాద్ : ‘ ది హండ్రెడ్‌ 2026’ టోర్నీకి పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ ను వేలంలో రూ.2.34 కోట్లకు కొనుగోలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్‌ లీడ్స్‌ జట్టు ఫ్రాంచైజీకి మరో షాక్ తగిలింది. కావ్య మారన్ కు చెందిన సన్ రైజర్స్ లీడ్స్ ఎక్స్ అకౌంట్ సస్పెండ్ కు గురైంది. రూల్స్ ఉల్లంఘించని అకౌంట్లను సస్పెండ్ చేస్తున్నామంటూ ఎక్స్ పేర్కొంది.

లండన్ లో జరిగిన వేలంలో సన్ రైజర్స్ లీడ్స్ జట్టుకు పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ ను కొనుగోలు చేయడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్ లో ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్ లను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీని ప్రభావం కూడా సన్ రైజర్స్ లీడ్స్ ఎక్స్ అకౌంట్ సస్పెండ్ కు ఓ కారణంగా భావిస్తున్నారు.

సన్ టీవీ నెట్ వర్క్ ఆధీనంలోకి సన్ రైజర్స్ లీడ్స్

గత సంవత్సరం ‘ది హండ్రెడ్‌’ టోర్నీలో పోటీ పడిన నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీని సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఇటీవల కొనుగోలు చేసి దానికి “సన్‌రైజర్స్ లీడ్స్” అని పేరు మార్చారు. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి 49% వాటా, మిగిలిన 51% వాటాను యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ నుంచి సన్ టీవీ నెట్ వర్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈసారి ఆ టోర్నీలో సన్ రైజర్స్ లీడ్స్ పేరుతో ఆ జట్టు పోటీ పడుతుంది. సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పూర్తిగా ఇప్పుడు సన్ గ్రూప్ యాజమాన్యం ఆధీనంలోకి వచ్చంది. దీనిని కళానిధి మారన్, ఆయన కుమార్తె కావ్యా మారన్ లీడ్ చేస్తున్నారు. అయితే జట్టు ఆటగాళ్ల వేలం పాటలో సన్ రైజర్స్ యాజమాన్యం కావ్య మారన్, ప్రధాన కోచ్ డానియల్ వెట్టోరీ హాజరయ్యారు.

అబ్రార్ ఎంపికపై విమర్శలు..ప్రధాన కోచ్ వెట్టోరీ వివరణ

పాక్ స్పిన్నర్ అబ్రార్‌ను జట్టులోకి తీసుకోవడంపై చెలరేగుతున్న వివాదంపై వెట్టోరీస్పందించారు. అబ్రార్ ను ఎందుకు జట్టులోకి తీసుకోవాల్సి వచ్చిందో వెట్టోరి వివరించాడు. వేలంలో మేం మొదట్లో ఆదిల్ రషీద్‌ను సొంతం చేసుకోలేకపోయాం అని, దీంతో జట్టులో ఓ విదేశీ స్పిన్నర్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నామని, మేం అనుకున్న నలుగురైదుగురిలో అబ్రార్‌ మెరుగైన స్పిన్నర్‌ అని భావించి అతడిని తీసుకున్నాం అని వివరణ ఇచ్చాడు. ఈ సందర్భంగా భారత్‌- పాకిస్థాన్‌ సంబంధాలపై మాట్లాడటానికి వెట్టోరీ నిరాకరించాడు. అయితే పాకిస్థాన్‌ క్రికెటర్ల ఎంపిక విషయమై కోచ్‌లు, మేనేజ్‌మెంట్‌ వేలానికి ముందు చర్చించుకోలేదని వెల్లడించాడు.25 ఏళ్ల పాక్ స్పిన్నర్ అబ్రార్ ర్ ఇప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు.

ఒప్పందాన్ని  బ్రేక్ చేసిన కావ్యా మారన్

2008 ముంబై దాడుల తర్వాత, ఐపీఎల్ సహా భారతీయుల యాజమాన్యంలో ఉన్న సౌతాఫ్రికా (SA20), యూఏఈ (ILT20) లీగ్స్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లపై అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇంగ్లాండ్‌లోని ‘ది హండ్రెడ్’ లీగ్‌లో వాటాలు కొనుగోలు చేసినప్పుడు కూడా పాక్ ఆటగాళ్లను దూరం పెడతారని అంతా భావించారు. అయితే, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) వివక్షకు తావులేకుండా అందరికీ సమాన అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అబ్రార్‌ను కొనుగోలు చేయడం ద్వారా కావ్యా మారన్ పాత ఆనవాయితీని బ్రేక్ చేసి సరికొత్త చర్చకు దారితీశారు.

ఇవి కూడా చదవండి :

Iftar Flexi Controversy | హైదరాబాద్‌లో ఇఫ్తార్ విందు ఫ్లెక్సీల వివాదం
Rashmika | లీకైన ఆడియోపై రష్మిక మందన్న ఫైర్.. 24 గంటల్లో తొలగించకపోతే లీగల్ యాక్షన్ హెచ్చరిక

Latest News