Grok AI : ‘ఎక్స్’కు భారత్ ప్రభుత్వం నోటీసులు
గ్రోక్ ఏఐలో మహిళల ఫోటోలతో అశ్లీల కంటెంట్ సృష్టించడంపై కేంద్రం సీరియస్ అయింది. నిబంధనల ఉల్లంఘనపై ‘ఎక్స్’కు నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ : ఎలాన్ మస్క్ సంస్థ ‘ఎక్స్’ కు భారత్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మహిళల గోప్యతను పట్టించుకోవడం లేదని ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. గ్రోక్ బికినీ ట్రెండ్‌తో మహిళల న్యూడ్ ఫోటోల వివాదం రేగింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని గ్రోక్‌లో ఆకతాయిలు అసభ్యకరమైన కంటెంట్ సృష్టిస్తున్నారు. మహిళల ఫోటోలు ఇచ్చి న్యూడ్ పిక్స్ కావాలని గ్రోక్ ను అడగడం.. గ్రోక్ ఇచ్చిన పోర్న్ ఔట్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేయడం చేస్తున్నారు. తద్వారా పోర్న్ సైట్లలో అమాయక మహిళలు, చిన్న పిల్లల కంటెంట్ ను వ్యాప్తి చేస్తున్నారు.
దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ఫిర్యాదు చేశారు. ఎక్స్ కంపెనీకి చెందిన ఏఐ యాప్లలో మహిళల మార్ఫింగ్ ఫొటోలు క్రియేట్ అవుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో గ్రోక్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించి ఎక్స్ కు నోటీసులు జారీ చేసింది. గ్రోక్ చాట్‌బాట్‌లో మహిళలపై అసభ్యకరమైన కంటెంట్ వెంటనే తొలగించాలని, 72 గంటల్లో ఇందుకు సంబంధించి నివేదిక అందించాలని ట్విట్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
ఐటీ యాక్ట్, 2000, ఐటీ రూల్స్, 2021 నిబంధనలను పాటించడంలో ఎక్స్ నిర్లక్ష్యం వహించిందని కేంద్రం తేల్చిచెప్పింది. గ్రోక్ ఏఐని మహిళలను అశ్లీల, లైంగిక వేధింపులకు గురి చేసేలా దుర్వినియోగం చేస్తున్నారని, ఇలాంటి కంటెంట్ ను ఈ చాట్ బాట్ లో అనుమతించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చట్ట విరుద్ధమైన కంటెంట్ ను అనుమతించకుండా చూసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యల గురించి వివరిస్తూ 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఏఐ ప్లాట్ ఫామ్స్ లో అశ్లీల కంటెంట్ కు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ఈ నోటీసు కాపీలను కీలక మంత్రిత్వ శాఖలు, కమిషన్లు, రాష్ట్రాల అధికారులకు కూడా కేంద్రం పంపింది. నకిలీ కంటెంట్, వార్తలు, దుష్ప్రచారానికి కేంద్రంగా మారుతున్న సోషల్ మీడియా, ప్లాట్‌ఫామ్‌లను జవాబుదారీగా ఉంచాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.
ఇవి కూడా చదవండి :
3rd World Telugu Conference : వైభవంగా మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం
China former mayor corruption| చైనా మాజీ మేయర్ ఇంట్లో.. టన్నుల కొద్దీ బంగారం, నగదు నిల్వలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram