Nidhhi Agerwal | ఫ్యాన్స్ నాడి పట్టేసిన నిధి అగర్వాల్.. పవన్, ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన కామెంట్స్
Nidhhi Agerwal | ఈ మధ్య టాలీవుడ్‌లో హీరోయిన్లు కేవలం సినిమాలతోనే కాదు, తమ మాటలతో, ప్రవర్తనతో కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాతృభాష తెలుగు కాకపోయినా, ఇతర భాషల నుంచి వచ్చిన నటీమణులు ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుని, ఇక్కడి సంస్కృతి, ఫ్యాన్స్ మెంటాలిటీని అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆ కోవలోనే టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ నిధి అగర్వాల్.
Nidhhi Agerwal | ఈ మధ్య టాలీవుడ్‌లో హీరోయిన్లు కేవలం సినిమాలతోనే కాదు, తమ మాటలతో, ప్రవర్తనతో కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాతృభాష తెలుగు కాకపోయినా, ఇతర భాషల నుంచి వచ్చిన నటీమణులు ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుని, ఇక్కడి సంస్కృతి, ఫ్యాన్స్ మెంటాలిటీని అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆ కోవలోనే టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ నిధి అగర్వాల్.
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఏ స్లోగన్లను ఎక్కువగా వినిపిస్తారు, ఏ మాటలకు ఎక్కువ స్పందిస్తారు అన్న విషయాన్ని గమనించి, అదే స్టైల్‌లో మాట్లాడి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయడంలో నిధి ముందుంటోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చేసిన హరిహర వీరమల్లు సినిమా విషయంలోనూ ఆమె చూపిన కమిట్‌మెంట్ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. సినిమా ఆలస్యం అవుతున్నా, నిర్మాతలకు ఇచ్చిన మాట కోసం నిధి ఆ ప్రాజెక్ట్‌ను వదలకుండా వెయిట్ చేయడం పవన్‌ను కూడా ఇంప్రెస్ చేసింది. ఈ విషయంపై స్వయంగా పవన్ నిధిని అభినందించడం విశేషం.అంతేకాదు, సినిమా రిలీజ్ సమయంలో పవన్ ఎక్కువగా ప్రమోషన్లకు టైమ్ ఇవ్వలేని పరిస్థితుల్లో, మొత్తం ప్రమోషన్ల భారం నిధే తన భుజాలపై వేసుకుని నిర్వహించింది. ఈ కమిట్‌మెంట్‌ను గుర్తించిన పవన్ కళ్యాణ్ మరోసారి నిధిని ప్రశంసించడంతో, పవన్ ఫ్యాన్స్ నుంచి ఆమెకు మరింత సపోర్ట్ లభించింది.
హరిహర వీరమల్లు సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఆ మూవీ చేసినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని నిధి స్పష్టంగా చెప్పింది. ఈ సినిమా వల్ల తన యాక్టింగ్‌కు మంచి పేరు వచ్చిందని, తన కెరీర్‌కు ఇది మంచి అనుభవంగా నిలిచిందని చెప్పి మరోసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.ఇప్పుడు నిధి ప్రభాస్‌తో నటిస్తున్న రాజా సాబ్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ కారణంగా కొంత ఇబ్బంది ఎదురైనా, వాటిని లైట్ తీసుకుని, ఫ్యాన్స్‌పై ఏ మాత్రం నెగటివ్‌గా స్పందించకుండా అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఆమెకు మంచి ప్రశంసలు దక్కాయి.
తాజాగా రాజా సాబ్ ప్రమోషన్లలో భాగంగా నిధి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను పనిచేసిన హీరోల గురించి ఫ్యాన్స్ ఎలా స్లోగన్లు వేస్తారో ఇమిటేట్ చేస్తూ, “పవన్ గురించి ఫ్యాన్స్ ‘బాబులకే బాబు కళ్యాణ్ బాబు’ అంటారు, ప్రభాస్ గురించి ‘రాజులకే రాజు ప్రభాస్ రాజు’ అంటారు, నన్ను మాత్రం ‘పాపలకే పాప నిధి పాప’ అంటారు” అంటూ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది.ఇవి మీకెలా తెలుసు? అని అడిగితే, సినిమా ఈవెంట్లలో ఫ్యాన్స్ స్లోగన్లను గమనించడం వల్లే ఇవన్నీ తెలుసుకున్నానని నిధి సమాధానం చెప్పింది. ఈ కామెంట్స్‌తో పవన్, ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఒకేసారి ఫిదా చేయడంతో పాటు, టాలీవుడ్‌లో ఫ్యాన్స్ నాడి పట్టేసిన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram