Dario Costa | పైలట్ డారియో కోస్టా మరో అరుదైన ఫీట్.. 120 కి.మీ వేగంతో దూసుకెళ్తున్న రైలుపై విమానం ల్యాండింగ్
ఇటలీకి చెందిన పైలట్ డారియో కోస్టా మరో ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న కార్గో రైలుపై విమానాన్ని ల్యాండ్ చేసి ఔరా అనిపించారు. ఆ వెంటనే టేకాఫ్ కూడా చేశాడు. ఈ క్రమంలో అతడు విమానయాన చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించాడు.
Dario Costa | విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయాలంటే అంత సులువు కాదు. ల్యాండింగ్ ప్రక్రియ చాలా క్లిష్టమైనది. జాగ్రత్తతో కూడుకున్నది. ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ సరైన టైమ్‌లో సరైన పద్ధతి ప్రకారం విమానాన్ని రన్‌వేపై ల్యాండ్ చేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. గాల్లోని ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి.
అందుకే రన్‌వేపై విమానం ల్యాండ్ అవుతోందంటే ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఒక్కసారి విమానం వీల్స్ భూమిని తాకాయంటే అంతా ఊపిరి పీల్చుకుంటారు. అంతక్లిష్టంగా ఉంటుంది ల్యాండింగ్ ప్రక్రియ. అయితే, ఇటలీకి చెందిన పైలట్ (Italian Pilot) డారియో కోస్టా (Dario Costa) సాధారణ రన్‌వేపై ల్యాండింగే కష్టమంటే ఏకంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న కార్గో రైలుపై విమానాన్ని ల్యాండ్ (Plane Landing on Moving Cargo Train)చేసి ఔరా అనిపించారు. ఆ వెంటనే టేకాఫ్ కూడా చేశాడు. ఈ క్రమంలో అతడు విమానయాన చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించాడు.
ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన, క్లిష్టమైన విన్యాసాల్లో ఇది ఒకటి కావడం విశేషం. గాల్లో విమాన వేగం, నేలపై రైలు వేగాన్ని సరితూచడం సాహసంతో కూడుకున్నది. అలాంటి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి ఔరా అనిపించాడు. ఈ సాహసోపేతమైన విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇది ఎలా సాధ్యం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గూస్ బంప్స్ సీన్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.
సాహసాలకు పెట్టింది పేరు డారియో కోస్టా..
డారియో కోస్టా (Dario Costa).. ఇటాలియన్ ప్రొఫెషనల్ ఏరోబాటిక్ పైలట్. ఆయన ఓ రెడ్ బుల్ అథ్లెట్ (Red Bull Air Race competitor). గాల్లో అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన విన్యాసాలు చేయడంలో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 2021లో తుర్కియేలోని ఇస్తాంబుల్ సమీపంలో ఉన్న రెండు వరుస హైవే టన్నెల్స్ (సొరంగ మార్గాల) గుండా విమానాన్ని నడిపి ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. సుమారు 2.26 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 44 సెకన్లలోపు పూర్తి చేశారు. రెడ్ బుల్ ఎయిర్ రేస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని డారియో విజయం సాధించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో గెలుపొందిన మొట్టమొదటి ఇటాలియన్ పైలట్‌గా రికార్డు క్రియేట్ చేశారు. ఆయన పేరిట ప్రస్తుతం ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు కదులుతున్న కార్గో రైలుపై తన విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసి మళ్ళీ అక్కడి నుండే టేకాఫ్ చేసి మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
Dario Costa Creates Sensational Record with Landing on Moving Cargo Train
#DarioCosta #Aviation #WorldRecord #StuntFlying #BreakingNews #Italy pic.twitter.com/t28AIhpU10— YourDailyNews (@yourdailynews9) February 17, 2026
ఇవి కూడా చదవండి :
Kannada TV Actress | నటి వాష్‌రూమ్‌లో ఉండగా.. సీక్రెట్‌గా వీడియో తీసి బ్లాక్‌మెయిల్
Emmanuel Macron | ముంబై వాసులను సర్‌ప్రైజ్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram