Fans War | ‘మంగాత్తా’ రీ రిలీజ్ వేళ రచ్చ …థియేటర్‌లో అజిత్–విజయ్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ

Fans War | తమిళ సినీ పరిశ్రమలో తల అజిత్ కుమార్, దళపతి విజయ్ అభిమానుల మధ్య పోటీ ఎప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. తాజాగా అజిత్ నటించిన 2011 నాటి సంచలన చిత్రం ‘మంగాత్తా’ (తెలుగులో గ్యాంబ్లర్) రీ రిలీజ్ సందర్భంగా ఈ అభిమాన ఘర్షణలు మరోసారి తారాస్థాయికి చేరాయి.

  • By: sn |    movies |    Published on : Jan 25, 2026 12:58 PM IST
Fans War | ‘మంగాత్తా’ రీ రిలీజ్ వేళ రచ్చ …థియేటర్‌లో అజిత్–విజయ్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ

Fans War | తమిళ సినీ పరిశ్రమలో తల అజిత్ కుమార్, దళపతి విజయ్ అభిమానుల మధ్య పోటీ ఎప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. తాజాగా అజిత్ నటించిన 2011 నాటి సంచలన చిత్రం ‘మంగాత్తా’ (తెలుగులో గ్యాంబ్లర్) రీ రిలీజ్ సందర్భంగా ఈ అభిమాన ఘర్షణలు మరోసారి తారాస్థాయికి చేరాయి. తమిళనాడులోని కారాకుడి పాండియన్ సినిమాస్‌లో ‘మంగాత్తా’ ప్రత్యేక ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఓ చేదు ఘటన చోటుచేసుకుంది.

అజిత్ అభిమానులు సినిమా సంబరాల్లో మునిగిపోయిన వేళ, ఓ దళపతి విజయ్ అభిమాని థియేటర్‌లోకి వచ్చి విజయ్ కొత్త రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) జెండాను ఊపుతూ రీల్స్ తీయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అజిత్ ఫ్యాన్స్ ఒక్కసారిగా అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు. అతని చొక్కా చింపివేసి, థియేటర్ నుంచి బయటకు గెంటివేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు “ఇలా హింసకు పాల్పడటం దారుణం” అని మండిపడుతుండగా, మరికొందరు “మరొక హీరో సినిమా సమయంలో రాజకీయ జెండాలు ఊపడం సరికాదు” అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన అభిమానుల మధ్య ఉన్న ఉద్రిక్తతను మరోసారి బయటపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు.

ఈ వివాదాల మధ్య కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం అజిత్ క్రేజ్ తగ్గలేదని ‘మంగాత్తా’ రీ రిలీజ్ స్పష్టంగా నిరూపించింది. రీ రిలీజ్ చిత్రాల విభాగంలో ఇప్పటివరకు విజయ్ నటించిన ‘గిల్లి’ పేరిట ఉన్న ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డును ‘మంగాత్తా’ అధిగమించింది. తొలి రోజే ఈ చిత్రం సుమారు రూ.4.1 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఇందులో తమిళనాడులోనే రూ.3.75 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదయ్యాయి.

దీంతో అజిత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో విజయ్ చివరి చిత్రంగా ప్రచారం పొందుతున్న ‘జన నాయగన్’ మాత్రం సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా వాయిదా పడింది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా అంశం ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉండగా, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని విజయ్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల మధ్య వివాదాలు ఎలా ఉన్నా, బాక్సాఫీస్ పోరు మాత్రం ఇంకా హీట్ తగ్గకుండా కొనసాగుతోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.