Shiva Pratap Shukla : తెలంగాణకు చేరుకున్న నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలంగాణకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు హైదరాబాదులో ప్రత్యేక స్వాగతం పలికారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Mar 10, 2026, 1:34 pm IST
Read Time: 3 mins
Shiva Pratap Shukla : తెలంగాణకు చేరుకున్న నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

విధాత, హైదరాబాద్ : తెలంగాణ నూతన గవర్నర్ గా నియామితులైన శివ ప్రతాప్ శుక్లా మంగళవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి డి.శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా నూతన గవర్నర్ కు వారందరిని సీఎం రేవంత్ రెడ్డి పరిఛయం చేశారు.

ఇటీవల గవర్నర్ల మార్పులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణ గవర్నర్ గా నియామించారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి 5వ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు గవర్నర్‌గా పనిచేసిన జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయ్యారు. రేపు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు లోక్ భవన్ లో చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

CBSE Class 12 Maths Paper : సీబీఎస్ఈ 12వ తరగతి క్యూఆర్ కోడ్ లో యూ ట్యూబ్ సాంగ్ !
ESMA : యుద్దం ఎఫెక్ట్.. చమురు శుద్ధి సంస్థలపై కేంద్రం ఎస్మా !