Revanth Reddy| తెలంగాణకు పదిన్నర ఏళ్లు నేనే సీఎం : రేవంత్ రెడ్డి

తెలంగాణకు పదిన్నర ఏళ్లు నేనే సీఎం అని, అప్పటిదాక తెలంగాణకు నేనే రాజు..నేనే మంత్రి అని, నాకు ఎవరూ పోటీ కాదు అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Revanth Reddy| తెలంగాణకు పదిన్నర ఏళ్లు నేనే సీఎం : రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణకు పదిన్నర ఏళ్లు నేనే సీఎం అని, అప్పటిదాక తెలంగాణకు నేనే రాజు..నేనే మంత్రి అని, నాకు ఎవరూ పోటీ కాదు అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2029లో జమిలి ఎన్నికలు వస్తాయని, ఈ కారణంగా మా ప్రభుత్వ కాలపరిమితి మరో ఆరు నెలలు పెరుగనుందని, మరో టర్మ్ అధికారంలోకి మళ్లీ వస్తామని, మొత్తం పదిన్నర ఏళ్లు నేనే తెలంగాణ సీఎంగా కొనసాగుతానని రేవంత్ రెడ్డి తెలిపారు. 2027 వరకు జిల్లాలలో ఎలాంటి మార్పులు ఉండబోవని, 2027లో డీలిమిటేషన్ తో పాటు , ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, సీట్ల పెంపు , నియోజకవర్గం పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అని తెలిపారు.

క్లైమాక్స్ కు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు

ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ కు చేరిందని, అన్ని కేసుల్లో దర్యాప్తు ఆధారంగానే ముందుకు వెళ్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ను జైల్లో వేయాలనుకుంటే నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాం అని, కేసీఆర్ పై నాకు ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని, ఫామ్ హౌస్ లో ఉంటూ ఇప్పటికే ఆయన స్వీయ శిక్ష వేసుకుంటున్నారన్నారు. నాకు ఎవరు పోటీ కాదు అని, నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించనని, నన్ను అనేవాళ్లనే నేను అంటున్నానని స్పష్టం చేశారు.

కాళేశ్వరం పై విచారణకు సిబిఐ డైరెక్టర్ తో పాటు కేంద్ర హోం శాఖకు లేఖ రాశాం. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు అని, కేసీఆర్ ను ఎందుకు లోపల వేయలేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కిషన్ రెడ్డి లేఖ రాస్తే ఫోన్ టాపింగ్ కేసు కూడా కేంద్రానికి ఇస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ,సోనియాగాంధీలను ప్రశ్నించిన ఈడీ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ను ఎందుకు విచారించడం లేదు అని ప్రశ్నించారు. ఈ కేసులో మనీలాండరింగ్ స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

కేసీఆర్, హరీష్ రావు కోరినట్లు ప్రభుత్వం నడవదు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం అధ్యయనం చేయాల్సి ఉందని, అధ్యయనం కోసం నిపుణుల కమిటీకి అప్పగించాము అని, మూడు గేట్ల మరమ్మతులు తర్వాత ప్రాజెక్టు కూలితే..అప్పుడు ఆ నింద మా పై వేయాలని బీఆర్ఎస్ చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును అరెస్టు చేస్తే సింపతి వచ్చిందని ఎవరన్నారని, ఎన్టీఆర్ విగ్రహాన్ని జూబ్లీహిల్స్ లో పెడుతామని, ఆయన నేషనల్ లీడర్ అని, భారత రత్నకు సిఫారసు చేస్తామని, ఎన్టీఆర్ కు బౌండరీస్ లేవు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

సింగరేణి బకాయిలపై బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని, నేను సింగరేణిపై ఒక్క రూపాయి కూడా భారం వేయలేదన్నారు. సింగరేణి టెండర్ గైడ్ లైన్స్ సహా అన్ని అంశాలపై అసెంబ్లీలో మాట్లాడుతానన్నారు.