Elon Musk : సంపదలో ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు
ఎలాన్ మస్క్ సంపద 600 బిలియన్ డాలర్లకు చేరి కొత్త రికార్డు! స్పేస్‌ఎక్స్, టెస్లా వాటాలు వలన ఆయన ప్రపంచంలో అత్యంత ధనవంతుడు.
న్యూఢిల్లీ : అపర కుబేరుడు..టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే 600 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా సరికొత్త రికార్డు సాధించాడు. మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ విలువ 800 బిలియన్ డాలర్లకు చేరుకుని, ఐపీఓకు వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆయన సంపద అమాంతంగా పెరగడం విశేషం. ఒక్క రోజులోనే 168 బిలియన్ డాలర్లు పెరిగి సోమవారం మధ్యాహ్నం సమయానికి (అమెరికా కాలమానం ప్రకారం) ఆయన నికర సంపద దాదాపు 677 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.
ప్రపంచ ధనవంతుడు
ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రస్తుతం వరల్డ్‌లోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు. మస్క్ నికర సంపద 2020మార్చి నాటికి 24.6 బిలియన్లు, 2024లో 400 బిలియన్లు, 2025 ఆక్టోబర్ లో 500 బిలియన్లు.. ఇప్పుడు 600 బిలియన్లకు పెరుగడం విశేషం. మస్క్ ఆస్తులు.. ఐదేళ్లలోనే 600 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ కుబేరుడు ఈ స్థాయిలో సంపదను ఆర్జించలేదు. మస్క్ తర్వాత ఒరాకిల్ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ గతంలో ఓసారి 400 బిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకున్నారు. స్పేస్‌ఎక్స్‌లో మస్క్‌కు 42శాతం వాటా ఉంది. ఈ కంపెనీ వచ్చే ఏడాది ఐపీఓకు వెళ్లనుంది. తొలుత 400 బిలియన్ డాలర్లతో ఎక్స్ఛేంజీ మార్కెట్‌లోకి రానున్నట్లు ఈ ఏడాది ఆగస్టులో వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ సంస్థ 800 బిలియన్ డాలర్ల విలువతో ఐపీఓకు వస్తున్నట్లు కంపెనీ ఇన్వెస్టర్లు కొందరు ఫోర్బ్స్‌కు వెల్లడించారు. ఈ వార్తలతో మస్క్ సంపద అకస్మాత్తుగా పరుగులు పెట్టింది.
త్వరలోనే తొలి ట్రిలియనీర్ గా మస్క్ కొత్త రికార్డు!
మరోవైపు మస్క్ టెస్లాలో 12శాతం వాటా కలిగి ఉన్నారు. ఈ ఆటోమొబైల్ కంపెనీ సీఈఓగా మస్క్‌కు ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీ ఇచ్చేందుకు ఈ ఏడాది నవంబరులో సంస్థ వాటాదారులు అంగీకరించారు. దీంతో ఆయన త్వరలోనే ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా సరికొత్త ఘనత సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు, తన కృత్రిమ మేధ సంస్థ ఎక్స్‌ఏఐ హోల్డింగ్స్‌లో మస్క్‌కు 53శాతం వాటా ఉండటం ఈ సందర్బంగా గమనార్హం. దీంతో మస్క్ సంపద అంతకంతకు పెరుగుతూనే వెలుతుంది.
ఇవి కూడా చదవండి :
India vs Malaysia : మలేషియాపై 315పరుగుల భారీ తేడాతో భారత్ విజయం
Bondi Beach Attack : సిడ్నీ ఉగ్రదాడి నిందితుడికి హైదరాబాద్ తో లింక్!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram