చరణ్ అభిమానులకు పుట్టినరోజున పూనకాలే..! సుకుమార్ మూవీపై సంచలన వార్త?

రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17 సినిమాపై ఆసక్తికర చర్చ. కథ లాక్ అయినట్లు సమాచారం. చరణ్ బర్త్‌డే రోజున సినిమా అప్‌డేట్ వచ్చే అవకాశమంటూ టాలీవుడ్‌లో ప్రచారం. హీరోయిన్‌గా సాయి పల్లవి, కృతి సనన్, అనుపమ పరమేశ్వరన్ పేర్లు వినిపిస్తుండగా జానర్‌పై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది.

చరణ్ అభిమానులకు పుట్టినరోజున పూనకాలే..! సుకుమార్ మూవీపై సంచలన వార్త? ‘రంగస్థలం’ తర్వాత మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి

Ram Charan Sukumar Movie Update: Shocking Surprise Expected on Charan Birthday

హైలైట్స్

  • చరణ్ – సుకుమార్ కాంబోలో #RC17 ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు
  • చరణ్ పుట్టినరోజున సినిమా అప్‌డేట్ వచ్చే అవకాశం
  • హీరోయిన్‌గా సాయి పల్లవి, కృతి సనన్, అనుపమ పేర్లు వినిపింపు
  • ‘పెద్ది’ టీజర్‌తో పాటు RC18పై కూడా సర్‌ప్రైజ్ అప్‌డేట్?

విధాత వినోదం డెస్క్​ | 17 మార్చి 2026 | హైదరాబాద్​:

రామ్ చరణ్ తదుపరి సినిమా గురించి టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ‘రంగస్థలం’ తర్వాత మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం RC17 వర్కింగ్ టైటిల్‌తో సిద్ధమవుతున్న ఈ సినిమాకు కథ ఇప్పటికే లాక్ అయినట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్‌ను ఫైన్ ట్యూన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో త్వరలో ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా పనులు ముగిసిన తర్వాత కొద్దికాలం విరామం తీసుకుని సుకుమార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే అభిమానుల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి అప్‌డేట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్.

క్యారెక్టరైజేషన్‌పై సుకుమార్ ఫోకస్

Ram Charan rugged look from Peddi movie poster

చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కూడా అదే రోజు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం

సుకుమార్ సినిమాల ప్రత్యేకత హీరో క్యారెక్టరైజేషన్. ‘ఆర్య’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ సినిమాల్లో కూడా కథ మొత్తం హీరో పాత్ర చుట్టూనే తిరిగింది. ఇప్పుడు చరణ్‌తో చేయబోయే సినిమాలో కూడా అదే తరహా పవర్‌ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చరణ్ చేయని విధంగా ఉండే ప్రత్యేకమైన పాత్రను సుకుమార్ రూపొందించారన్న ప్రచారం ఉంది. ఆ క్యారెక్టర్‌కు తగ్గట్లుగా కథను నిర్మిస్తున్నారని సమాచారం. కథకు రెండు వర్షన్లు సిద్ధం చేసి వాటిలో ఒకదాన్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సాయి పల్లవి, కృతి సనన్, అనుపమ పరమేశ్వరన్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

మళ్లీ గ్రామీణ నేపథ్యమేనా? ఆధునిక పోకడా?

ఇదిలా ఉంటే ఈ సినిమా జానర్ విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. ‘రంగస్థలం’ పూర్తిగా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది కాబట్టి ఈసారి కథ అర్బన్ నేపథ్యంలో ఉండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొంతకాలం క్రితం ఈ సినిమా కౌబాయ్ జానర్‌లో ఉండొచ్చన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో కథ ఏ దిశలో సాగుతుందన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

ఇక చరణ్ తదుపరి ప్రాజెక్ట్ అయిన RC18కు సంబంధించిన అప్‌డేట్ కూడా అదే రోజు వచ్చే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? నిర్మాణ సంస్థ ఏది? అనే వివరాలు కూడా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇంతకుముందు ‘సలార్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయనున్నట్లు ప్రశాంత్ నీల్ స్వయంగా ట్విటర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్‌నే RC18గా ప్రకటిస్తారా? లేక మరో కొత్త కాంబినేషన్‌ను ప్రకటిస్తారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Ram Charan with Salaar director Prashanth Neel about possible RC18 project

ప్రశాంత్ నీల్‌తో సినిమా చర్చలపై ఆసక్తి పెంచుతున్న రామ్ చరణ్

కాగా, ‘రంగస్థలం’ తర్వాత మళ్లీ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో  ఆర్​సీ17పై భారీ హైప్ ఏర్పడింది. ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్‌తో కథను సిద్ధం చేస్తున్న సుకుమార్, ఈసారి కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారా అన్న ఆసక్తి సినీ వర్గాల్లో కనిపిస్తోంది. త్వరలో వచ్చే అధికారిక అప్‌డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.