డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ రాక్షసులు : గరికపాటి కీలక వ్యాఖ్యలు

గరికపాటి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు—ట్రంప్, ఎలాన్ మస్క్‌ను రాక్షసులుగా అభివర్ణించారు. ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై మాటలు వివాదం రేపాయి.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Mar 02, 2026, 3:30 pm IST
Read Time: 3 mins
డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ రాక్షసులు : గరికపాటి కీలక వ్యాఖ్యలు

విధాత: అమెరికా అధ్యక్షుడు డ్రొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ లపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ రాక్షసులు అంటూ అభివర్ణించారు. విష్ణమూర్తి శాపంతో జయవిజయులు రాక్షస జన్మల పరంపరలో తమ నాల్గవ జన్మగా ట్రంప్, మస్క్ రూపంలో అవతరించారని, వాళ్లను నాశనం చేయడానికి శ్రీమహా విష్ణువు రావాల్సిందేనన్నారు. ఇందుకోసం మనమంతా ప్రార్ధన చేయాలని చెప్పారు.

కనిపించిన దేశంపై ట్రంప్ దండ యాత్ర చేస్తాడని, మస్క్ రియల్ ఎస్టేట్ కోసం అంగారక గ్రహంపై కాలనీ కడుతానంటున్నాడని..ప్రపంచ ఆధిపత్యం కోసం తపించే వీళ్లా.. అగ్రనాయకులు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇలా అన్నందుకు నా పీక తీసేస్తారా తీసేయనియ్యండన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలపై నా ప్రాణంపోతే అంతకంటే అదృష్టం లేదన్నారు. మాట్లాడటానికే భయపడే వారు కార్యాచరణ ఎలా చేస్తారని, యువతరం ధైర్యం నింపుకోవాలన్నారు.

ప్రపంచ మహాసభలలో గరికపాటి ఉపన్యాసం ఇప్పటికే ఏపీలో వివాదస్పదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరులో తెలుగుదనం లేదని, రాష్ట్రం పేరును తెలుగనాడుగా మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ప్రాచీన చరిత్ర కల్లిన ఆంధ్ర పదాన్ని తప్పుబడుతారా అంటూ ఆయనపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఇది ఇలా ఉండగానే ఇదే వేదికపై ట్రంప్, మస్క్ లను రాక్షసులు అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి.

ఇవి కూడా చదవండి :

INSV Kaundinya : కౌండిన్య తిరిగొచ్చిందోచ్..!
Ayatollah Khamenei : ఖమేనీ మరణం..ఆ మహిళల వీడియోలు వైరల్