IRCTC Thailand Tour | హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ టూర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. రూ.53,900 నుంచే!
IRCTC Thailand Tour | హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌కు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ వేసవి కాలంలో బ్యాంకాక్, పట్టాయాలో సందర్శించేందుకు"ట్రెజర్స్ ఆఫ్ థాయ్‌లాండ్ ఎక్స్ - హైదరాబాద్" పేరుతో ప్యాకేజీని ప్రకటించింది.
irctc-thailand-bangkok-tour
IRCTC Thailand Tour | ఈ వేసవి సెలవుల్లో థాయ్‌లాండ్ వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. “ట్రెజర్స్ ఆఫ్ థాయ్‌లాండ్ ఎక్స్ – హైదరాబాద్” (Treasures of Thailand Ex – Hyderabad) పేరుతో ఈ ట్రావెల్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా బ్యాంకాక్‌తో పాటు థాయ్‌లాండ్‌లోని ప్రముఖ ప్రాంతమైన పట్టాయా (Pattaya)ను సందర్శించవచ్చు. వచ్చే ఏప్రిల్ 24వ తేదీన హైదరాబాద్ నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు రాత్రులు, ఐదు రోజుల పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్ (Hyderabad) చేరుకోనున్నారు.
హైదరాబాద్ నుంచి విమానంలో బ్యాంకాక్ చేరుకుని, అక్కడి నుంచి పట్టాయాకు వెళ్లేలా ఈ టూర్ ప్యాకేజీని రూపొందించారు. నాలుగు రాత్రులు, ఐదు రోజుల పర్యటన అనంతరం ఏప్రిల్ 28వ తేదీన హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. మొత్తం 30 మంది ప్రయాణికులతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ను ఆఫర్ చేస్తోంది.
ఈ టూర్ కోసం ఐఆర్‌సీటీసీ పెద్దల నుంచి ఒక్కొక్కరికీ రూ.61,850(సింగిల్ ఆక్యుపెన్సీ) వసూలు చేస్తోంది. అదే డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ.53,900; ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.53,800 చార్జి చేస్తుంది. ఇక పిల్లలకు అయితే బెడ్‌తో కలిపి రూ.51,150; బెడ్ లేకుండా అయితే రూ.44,650 వసూలు చేస్తున్నారు.
షెడ్యూల్ ఇదీ..
మొదటి రోజు: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు తెల్లవారుజామున 2.15 గంటలకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఉదయం 5.40 గంటలకు విమానంలో బయల్దేరి బ్యాంకాక్ చేరుకుంటారు. అక్కడి నుంచి పట్టాయా చేరుకుంటారు. అక్కడ ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం చేసుకుని హోటల్‌కు వెళ్తారు. సాయంత్రం ఆల్కజార్ క్యాబరే షోను ఆస్వాదిస్తారు.
రెండో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం కోరల్ ఐలాండ్ సందర్శించేందుకు వెళ్తారు. అనంతరం నాంగ్ నూచ్ ట్రోపికల్ గార్డెన్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం, రాత్రి ఇండియన్ రెస్టారెంట్‌లోనే భోజనం ఉంటుంది. రాత్రికి పట్టాయాలోని హోటల్‌లో బస చేస్తారు.
మూడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ చెకవుట్ చేస్తారు. పట్టాయాలోని జెమ్స్ గ్యాలరీని సందర్శిస్తారు. అనంతరం బ్యాంకాక్‌కు చేరుకుంటారు. అక్కడ ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం అనంతరం బ్యాంకాక్ సిటీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా గోల్డెన్ బుద్ధ ఆలయం, మార్బుల్ టెంపుల్ వంటి ప్రదేశాలను సందర్శిస్తారు. రాత్రికి ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసుకుని, బ్యాంకాక్‌లోనే బస చేస్తారు.
నాలుగో రోజు: హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనంతరం సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్ టూర్‌కు వెళ్తారు. సాయంత్రం చావో ఫ్రాయా నదిలో డిన్నర్ క్రూజ్‌లో వెళ్తారు. రాత్రికి బ్యాంకాక్‌లో బస చేస్తారు.
ఐదో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం చెక్‌అవుట్ చేసి విమానాశ్రయానికి బయల్దేరి వెళ్తారు. ఉదయం 8 గంటలకు బయల్దేరి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
ప్యాకేజీలో ఉండే సదుపాయాలు
* హైదరాబాద్ – బ్యాంకాక్ రౌండ్ ట్రిప్ విమాన టికెట్లు
* 3 స్టార్ హోటల్‌లో వసతి
* నాలుగు బ్రేక్‌ఫాస్ట్‌లు, నాలుగు లంచ్‌లు, నాలుగు డిన్నర్‌లు
* పట్టాయాలోని కోరల్ ఐలాండ్ టూర్, అల్కజార్ షో
* పట్టాయాలోని నాంగ్ నూచ్ ట్రోపికల్ గార్డెన్
* సఫారి వరల్డ్, మెరైన్ పార్క్
* చావ్‌ఫ్రాయా నది డిన్నర్ క్రూయిజ్
* స్థానిక టూర్ గైడ్ సేవలు
* ట్రావెల్ ఇన్సూరెన్స్
ప్యాకేజీలో లేని సదుపాయాలు
* వ్యక్తిగత ఖర్చులు
* డ్రైవర్, గైడ్‌లకు టిప్స్
* ప్యాకేజీలో పేర్కొనని ఇతర సేవలు
* భోజనంలో ప్రత్యేక ఎంపికలు
* అదనపు పన్నులు లేదా సర్‌చార్జిలు
ముఖ్య నిబంధనలు
ఈ టూర్‌కు కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు తప్పనిసరిగా ఉండాలి. థాయ్‌లాండ్ వీసా ఆన్ అరైవల్ సమయంలో ఒక్కో వ్యక్తి కనీసం 10 వేల థాయ్‌బాట్ లేదా కుటుంబానికి 20 వేల థాయ్ బాట్ నగదు చూపించాల్సి ఉంటుంది. హోటల్ చెక్ ఇన్, చెక్ అవుట్ సమయాలు హోటల్ నిబంధనల ప్రకారం ఉంటాయి.
క్యాన్సలేషన్ పాలసీ
* 41 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే 20 శాతం చార్జీలు కట్ చేసుకుంటారు.
* 40-31 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే 25 శాతం చార్జీలు
* 30-21 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే 35 శాతం చార్జీలు
* 20-15 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే 60 శాతం చార్జీలు
* 14-8 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే 90 శాతం చార్జీలు
* 8 రోజుల లోపు క్యాన్సిల్ చేస్తే 100 శాతం చార్జీలు
Read More:
IRCTC Royal Nepal Package | హైదరాబాద్ నుంచి నేపాల్ టూర్.. ఐఆర్‌సీటీసీ కొత్త ట్రావెల్ ప్యాకేజీ
IRCTC Andaman Package | హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే!
అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు.. ఐఆర్‌సీటీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ వివరాలివే!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram