Telangana Municipal Elections : రేపు కౌంటింగ్..పుర పోరులో క్యాంపు రాజకీయాలకు లేచిన తెర!
రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మేయర్, చైర్మన్ పదవుల కోసం పార్టీల మధ్య క్యాంపు రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి.
విధాత: తెలంగాణ రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్..ఫలితాల వెల్లడి ప్రక్రియ కొనసాగనుండగా.. మరోవైపు ప్రధాన పార్టీలు మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు పోటాపోటీగా క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కార్పోరేషన్లు, 116మున్సిపాల్టీలలో రేపు శుక్రవారం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. అయితే పలు కార్పోరేషన్లు, మున్సిపాల్టీలలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులు తమ చేజారిపోకుండా ఆ పార్టీల నాయకత్వం అప్రమత్తమైంది. ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు అభ్యర్థులతో ఆయా పార్టీల కీలక నేతలు సమావేశాలను నిర్వహిస్తున్నారు. కార్పోరేటర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేసిన అభ్యర్థులను రహస్య క్యాంపులకు తరలించే పనిలో తలమునకలయ్యారు.
క్యాంపు రాజకీయాలతోనే రక్షణ
మేయర్, మున్సిపల్ చైర్మన్ల పదవులను గెలుచుకోవడంలో క్యాంపు రాజకీయాలే మేలకునుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా.. పార్టీ ఫిరాయింపులను అడ్డుకునే వ్యూహాంలోనే తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీలు క్యాంపు రాజకీయాలకు మొగ్గుచూపుతున్నాయి. 16న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక రోజు వరకు తమ అభ్యర్ధులు చేజారిపోకుండా విప్ జారీ సహా క్యాంపులతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుున్నారు.
సూర్యాపేటలో మాజీ మంత్రి జీ.జగదీష్ రెడ్డి సూచనలతో బీఆర్ఎస్ అభ్యర్థులు 48 మంది క్యాంపుకు తరలివెళ్లినట్లుగా తెలుస్తుంది. అదిలాబాద్, నిర్మల్ మున్సిపల్ పరిధిలో క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన క్యాంపు కార్యాలయానికి అభ్యర్థులను పిలిపించి ప్రత్యేక బస్సుల్లో వారిని తరలించే ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం. అటు నిర్మల్‌లో బీజేపీ మహేశ్వర్ రెడ్డి నివాసంలో 42 మంది అభ్యర్థులతో సమావేశం నిర్వహించి వారిని క్యాంపునకు తరలించారు.ఇదే రీతిలో రాష్ట్రంలోని పోటాపోటీ బలాబలాలు ఉండే అవకాశం ఉన్న మున్సిపాల్టీలలో రాజకీయ పార్టీలు క్యాంపు రాజకీయాలను ఆశ్రయించడంతో 16న జరిగే మేయర్, చైర్మన్ల ఎన్నికలు ఉత్కంఠగా జరుగబోతున్నాయనడానికి నిదర్శనంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి :
iPhone 18 Pro Leaks | సరికొత్త అవతారంలో ఐఫోన్ 18 ప్రొ – చిన్న డైనమిక్ ఐలండ్, కొత్త రంగులు
Beach Landing in Mogadishu | బీచ్‌లో దిగిన విమానం… షాక్లో ప్రయాణీకులు! – సోమాలియాలో అద్భుతం!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram