iPhone 18 Pro Leaks | సరికొత్త అవతారంలో ఐఫోన్ 18 ప్రొ – చిన్న డైనమిక్ ఐలండ్, కొత్త రంగులు
iPhone 18 Pro, Pro Max మోడల్స్‌లో యూనిఫైడ్ బ్యాక్ డిజైన్, 35 శాతం చిన్న డైనమిక్ ఐలాండ్, కొత్త బోల్డ్ కలర్స్ రానున్నాయి. 2026లో విడుదలయ్యే ఈ ఫోన్లు ప్రీమియం లుక్‌తో పాటు మెరుగైన పనితీరును అందించనున్నాయి.
iPhone 18 Pro Leaks: 9to5Mac Report Reveals New Design, Smaller Dynamic Island, Bold Colors
సారాంశం
9to5Mac రిపోర్ట్ ప్రకారం iPhone 18 Pro సిరీస్‌లో యూనిఫైడ్ బ్యాక్ డిజైన్, సుమారు 35% చిన్న డైనమిక్ ఐలాండ్, Coffee Brown, Purple, Burgundy వంటి కొత్త రంగులు రానున్నాయి. ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉండటంతో పాటు, కెమెరా, A20 చిప్ అప్‌గ్రేడ్స్ ఈ మోడల్స్‌ను 2026లో ప్రీమియం సెగ్మెంట్‌లో మరింత బలపరచే సూచనలు కనిపిస్తున్నాయి.
విధాత టెక్ డెస్క్ | హైదరాబాద్:
iPhone 18 Pro Leaks | ఐఫోన్ 18ప్రొ, 18ప్రొ మ్యాక్స్ మోడల్స్‌లో వెనుకభాగంలో ఏకీకృత డిజైన్ , 35 శాతం చిన్న డైనమిక్ ఐలాండ్, కొత్త బోల్డ్ కలర్స్ రానున్నాయి. 2026 సెప్టెంబర్‌లో విడుదలయ్యే ఈ ఫోన్లు ప్రీమియం లుక్‌తో పాటు మెరుగైన పనితీరును అందించనున్నాయి. తాజా లీకుల్లో మరిన్ని వివరాలు.
యూనిఫైడ్ బ్యాక్‌తో కొత్త మెరుపు

రాబోయే iPhone 18 సిరీస్‌పై టెక్ ప్రపంచంలో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రముఖ టెక్ వెబ్‌సైట్ అయిన 9to5Mac తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈసారి ఫోన్ డిజైన్‌లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
iPhone 17 Proలో కనిపించిన రెండు రంగుల బ్యాక్ డిజైన్‌పై వినియోగదారుల్లో మిశ్రమ స్పందన రావడంతో, ఆపిల్ కొత్త దిశలో అడుగులు వేస్తోంది. బ్యాక్ గ్లాస్, అల్యూమినియం ఫ్రేమ్ మధ్య రంగు తేడాను తగ్గించి, ఒకేలా కనిపించే యూనిఫైడ్ ఫినిష్ అందించనున్నట్లు లీకులు చెబుతున్నాయి. దీని వల్ల ఫోన్ మరింత ప్రీమియం లుక్‌ను సంతరించుకోనుంది. ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారుల అంచనాలకు తగ్గట్టుగా ఈ డిజైన్ ఉండనుందని నిపుణులు భావిస్తున్నారు.
చిన్న డైనమిక్ ఐలాండ్‌తో ఎక్కువ స్క్రీన్ స్పేస్

ఐఫోన్ 18 ప్రొ ముందుభాగపు డిజైన్‌లో డైనమిక్ ఐలాండ్ కీలక గుర్తింపుగా మారింది. అయితే, ఇటీవల హోల్-పంచ్ డిజైన్‌పై ప్రచారం జరిగినప్పటికీ, ఆపిల్ ఇప్పట్లో ఆ దిశగా వెళ్లడం లేదని 9to5Mac స్పష్టం చేసింది.
తాజా సమాచారం ప్రకారం, డైనమిక్ ఐలాండ్‌ను సుమారు 35 శాతం వరకు తగ్గించనున్నారు. ఫేస్ ఐడీకి సంబంధించిన కొన్ని సెన్సార్లను డిస్‌ప్లే కిందకు తరలించడం ద్వారా ఈ మార్పు సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీని వల్ల వినియోగదారులకు మరింత స్క్రీన్ స్పేస్ లభించనుంది. ముఖ్యంగా వీడియోలు, గేమ్స్, సోషల్ మీడియా వినియోగంలో మెరుగైన అనుభవం పొందే అవకాశం ఉంది. స్క్రీన్ సైజ్ మాత్రం గత మోడల్స్‌లాగే కొనసాగనుంది.
కొత్త రంగులు.. ధరలపై శుభవార్త

రంగుల విషయంలో కూడా ఈసారి ఆపిల్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. iPhone 17 Proలో Cosmic Orangeకి వచ్చిన స్పందనతో ప్రోత్సాహం పొందిన కంపెనీ, iPhone 18 Proలో Coffee Brown, Purple, Burgundy వంటి కొత్త ఛాయలను పరీక్షిస్తోంది. అయితే వీటిలో ఒకటి లేదా రెండు మాత్రమే తుది జాబితాలోకి వచ్చే అవకాశం ఉంది. సంప్రదాయ బ్లాక్ కలర్ ఈసారి కనిపించకపోవచ్చనే ప్రచారం కూడా ఆసక్తికరంగా మారింది.
ధరల విషయానికి వస్తే, మెమరీ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, iPhone 18 Pro ధరలు గత మోడల్స్‌తో సమానంగా ఉండే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సరఫరాదారులతో ఒప్పందాలు, ఇతర భాగాల ఖర్చు తగ్గింపు ద్వారా ఆపిల్ ఈ స్థిరత్వాన్ని సాధించనుందని సమాచారం.
ఇక కెమెరా విభాగంలో వేరియబుల్ అపర్చర్ టెక్నాలజీ, కొత్త A20 ప్రాసెసర్ వంటి అప్‌గ్రేడ్స్ కూడా రానున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే, iPhone 18 Pro పెద్ద మార్పులకన్నా, మెరుగైన అప్‌డేట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.
మొత్తంగా, iPhone 18 Pro సిరీస్ ప్రీమియం సెగ్మెంట్‌లో ఆపిల్ స్థానాన్ని మరింత బలపరచనుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram