China former mayor corruption| చైనా మాజీ మేయర్ ఇంట్లో.. టన్నుల కొద్దీ బంగారం, నగదు నిల్వలు

చైనాలోని హైకౌ మాజీ మేయర్ జాంగ్ క్యూ అవినీతి వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. అతని వద్ద ఏకంగా 13.5టన్నుల బంగారం, 23టన్నుల నగదు పాటు చైనాతో పాటు విదేశాలల్లోని విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లను దర్యాప్తు అధికారులు గుర్తించి షాక్ అయ్యారు.

China former mayor corruption| చైనా మాజీ మేయర్ ఇంట్లో.. టన్నుల కొద్దీ బంగారం, నగదు నిల్వలు

విధాత: భారత్ లోనే కాదు..చైనాలోని అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతుంది. తాజాగా చైనా(China)లోని హైకౌ మాజీ మేయర్ జాంగ్ క్యూ  (former mayor Zhang Qiu) అవినీతి వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. జాంగ్ క్యూ అవినీతి సొమ్మును వెలికితీసిన అధికారులు ఆయన వద్ద లభించిన అక్రమ సంపాదన చూని దిగ్బ్రాంతికి గురయ్యారు. అతని వద్ద ఏకంగా 13.5టన్నుల బంగారం, 23టన్నుల నగదు (tonnes of gold cash seized) పాటు చైనాతో పాటు విదేశాలల్లోని విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లను గుర్తించి షాకయ్యారు. హైకౌ మాజీ మేయర్ జాంగ్ క్యూ తీవ్ర అవినీతి ఆరోపణలపై మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ భూ ఒప్పందాలు, కాంట్రాక్టుల ద్వారా ఆయన బిలియన్ల డాలర్ల మేర లంచాలు పొందినట్లు దర్యాప్తు అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. జాంగ్ క్యూ వద్ద అపారమైన అక్రమ సంపద బయటపడిన తీరు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం ష్టించింది.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రభుత్వం అవినీతి అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉక్కు పాదం మోపుతుంది. 2012నుంచి లక్ష మందికి పైగా అధికారులపై అవినీతి కేసులు నమోదు చేసి పలు రకాల శిక్షలు విధించింది. వాటిలో మరణశిక్షలు కూడా ఉండటం గమనార్హం. ఇటీవల డిసెంబర్ నెలలో చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌లో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బాయి టియాన్‌హుయ్ 1.1 బిలియన్ యువాన్లకు(దాదాపు రూ.1,404 కోట్లు) పైగా చట్టవిరుద్ధమైన అక్రమ ఆస్తులు పొందారని కోర్టులు తేల్చిన తర్వాత అతణ్ని ఉరితీసింది. రూ.1,404 కోట్ల అవినీతి, లంచం తీసుకున్న నేరాలకు సంబంధించిన కేసులో ఈ మరణశిక్షను విధించింది. చైనాలో క్రిమినల్ కేసుల్లో మినహా అవినీతి కేసుల్లో మరణిశిక్షలు చాల అరుదుగా విధించారు.

అంతకుముందు చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్‌మెంట్ చైర్మన్‌గా పనిచేసిన లై షియోమిన్ 1.79 బిలియన్ యువాన్ల లంచం తీసుకున్నందుకు దోషిగా తేలిన తర్వాత 2021లో ఉరితీశారు. తాజాగా ఈ ఏడాది వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి టాంగ్ రెన్‌జియాన్‌కు కూడా చైనా మరణశిక్ష విధించింది. రూ.334 కోట్ల మేర లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఆయన పై ఈ మేరకు చర్యలు తీసుకుంది. విచారణకు సహకరించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్ష అమలును రెండేళ్లపాటు నిలిపివేసింది.