Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు త్వరలోనే కల్యాణ యోగం..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ రోజు గొప్ప అదృష్టదాయకంగా ఉంటుంది. మీ అంచనాలకు మించిన శుభ ఫలితాలు సాధిస్తారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మీ గౌరవం, ఖ్యాతి పెరుగుతాయి. వ్యాపారం బాగా రాణిస్తుంది. అవివాహితులకు త్వరలోనే కల్యాణ యోగం ఉంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు వ్యాపారపరంగా ఈ రోజు అద్బుతమైన రోజు. పెట్టుబడులు, లాభాలు రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు లభించే ప్రశంసలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే మంచిది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో రాజీపడేందుకు ప్రయత్నించండి. సానుకూల ఆలోచనలతో ముందుకెళ్తే అవరోధాలు తొలగుతాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రారంభించిన పనుల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలు తెలివిగా నిర్వహించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో వివాదాలకు అవకాశం లేకుండా చూసుకోండి. ఇతరులతో మృదుస్వభావంతో మాట్లాడితే కలహాలు ఉండవు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మనోధైర్యంతో విజయావకాశాలు పెరుగుతాయి. ప్రారంభించిన ప్రతి పనిలోనూ సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధి బలంతో ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ప్రారంభించిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులకు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి.అయితే కీలక పెట్టుబడుల విషయంలో ఆచి తూచి నడుచుకోవాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అందరినీ కలుపుకుని ముందుకు పోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కీలక సమావేశాల్లో మీ వాదనాపటిమతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరంగా భవిష్యత్ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం శక్తినిస్తుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ధనలాభాలు పెరుగుతాయి. గత పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం ప్రశాంతతనిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేయడం మంచిది. ఆర్థిక క్రమశిక్షణతో ఖర్చులు అదుపులో ఉంటాయి. కుటుంబ కలహాలు సమర్ధవంతంగా పరిష్కరిస్తారు. కొందరి ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరమైన పురోగతి ఉంటుంది. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో మౌనంగా ఉండటం శ్రేయస్కరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. వృత్తి పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ చాలా కాలంగా ఎదురుచూస్తున్న మైలురాయిని అందుకుంటారు. ఉద్యోగంలో మీ హోదా పెరుగుతుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఉన్నతాధికారుల సహకారం ప్రోత్సాహాన్నిస్తుంది. ధనయోగం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, ప్రియమైనవారితో వాగ్వాదాలకు అవకాశం లేకుండా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram