• Telugu News
  • /International

Mountain Escalator | కొండ‌పైకి వెళ్లేందుకు ఎస్క‌లేట‌ర్‌.. ఎక్క‌డో తెలుసా..? ఆక‌ట్టుకుంటున్న వీడియో

చైనాలో కొండపైకి వెళ్లేందుకు నిర్మించిన మౌంటెయిన్ ఎస్కలేటర్ నెట్టింట వైరల్‌గా మారింది. కేవలం 10 నిమిషాల్లోనే పర్వత శిఖరానికి చేరుకునేలా ఈ అద్భుత నిర్మాణం ఆకట్టుకుంటోంది.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Feb 06, 2026, 9:50 pm IST
Read Time: 5 mins
Mountain Escalator | కొండ‌పైకి వెళ్లేందుకు ఎస్క‌లేట‌ర్‌.. ఎక్క‌డో తెలుసా..? ఆక‌ట్టుకుంటున్న వీడియో

Mountain Escalator | పర్యాటక రంగానికి చైనా ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ప్రపంచంలో ఎక్కడా లేని వింతల్ని సృష్టిస్తుంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కట్టడాలకు చైనా పెట్టింది పేరు. ఇప్పటికే చైనా (China) చేపట్టిన ఎన్నో నిర్మాణాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అలాంటి నిర్మాణాల్లో మౌంటెయిన్‌ ఎస్కలేటర్‌ (Mountain Escalator) ఒకటి.

ప‌ది నిమిషాల్లో..

తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌ (Jiangxi province)లోగ‌ల సుంద‌ర‌మైన లింగ్షాన్ ప‌ర్వ‌తాల‌ను (Lingshan Mountain) తిల‌కించేందుకు ఏటా సంద‌ర్శ‌కులు త‌ర‌లి వ‌స్తుంటారు. అయితే, ఆ ప‌ర్వ‌త శిఖ‌రం చాలా ఎత్తులో ఉండేది. దాన్ని ఎక్కాలంటే దాదాపు రెండు నుంచి మూడు గంట‌ల స‌మ‌యం ప‌ట్టేది. దీంతో ప‌ర్యాట‌కులు కూడా ఇబ్బంది ప‌డేవారు. వారి ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకొని చైనా ప్ర‌భుత్వం ఆ ప‌ర్వ‌తంపైకి వెళ్లేందుకు 1,236 మీట‌ర్ల పొడ‌వుతో ఎస్క‌లేట‌ర్‌ను నిర్మించింది. ఇప్పుడు దీని ద్వారా కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే కొండ‌పైకి చేరుకోవ‌చ్చు.

ప్ర‌పంచంలోనే అతి పొడ‌వైంది..

కేవ‌లం 10 నిమిషాల్లోనే ఎలాంటి శ్ర‌మ, అల‌స‌టా లేకుండా ప‌ర్వ‌తంపైకి ఎక్కేస్తున్నారు టూరిస్ట్‌లు. చైనాలో ఇప్ప‌టికే ఇలాంటి ఓ ఎస్క‌లేట‌ర్ ఉంది. హుబే ప్రావిన్స్‌లో 688 మీట‌ర్ల అబ్జ‌ర్వేష‌న్ ఎస్క‌లేట‌ర్ ఉంది. అయితే, జియాంగ్జీలో కొత్త‌గా నిర్మించిన ఈ ఎస్క‌లేట‌ర్ ప్ర‌పంచంలోనే అతి పొడ‌వైన‌దిగా రికార్డు సృష్టించింది.

నెటిజ‌న్ల రియాక్ష‌న్‌

ఈ ఎస్క‌లేట‌ర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇది నెటిజ‌న్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. చైనాకే ఇలాంటివి సాధ్యం అంటూ వీడియోని రీ ట్వీట్ చేస్తున్నారు. మ‌న ద‌గ్గ‌ర కూడా ఇలాంటివి అందుబాటులో ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

లింగ్షాన్ ప‌ర్వ‌తాలు..

లింగ్షాన్ ప‌ర్వ‌తాలు స‌హ‌జ సౌంద‌ర్యానికి ప్రసిద్ధి. మొత్తం 72 శిఖ‌రాలు, 108 రాతి నిర్మాణాల‌తో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తుంటుంది. దీని ప్ర‌ధాన శిఖ‌రం ఎత్తు ఏకంగా 1,496 మీట‌ర్లు. ఈ ప‌ర్వ‌త సౌంద‌ర్యాన్ని తిల‌కించేందుకు ఏటా ల‌క్ష‌లాది మంది ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు.

ఇవి కూడా చదవండి :

TGSPDCLలో మీటర్ల కొరత.. యావరేజ్ బిల్లులతో వినియోగదారులకు భారీ భారం.. నెలకు రూ.1000 వరకు అదనపు చార్జీలు
Secretariat SC ST Promotions | ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అణచివేత.. ఐదుగురు మంత్రులున్నా అన్యాయమే!