Rashmika | లీకైన ఆడియోపై రష్మిక మందన్న ఫైర్.. 24 గంటల్లో తొలగించకపోతే లీగల్ యాక్షన్ హెచ్చరిక

Rashmika | సోషల్ మీడియాలో గత కొన్నేళ్లుగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌, వ్యక్తిగత దాడులపై కన్నడ బ్యూటీ ర‌ష్మిక మంధాన‌ ఎట్టకేలకు స్పందించారు. ఎనిమిదేళ్లుగా మౌనంగా భరించిన ఈ వ్యవహారంపై ఇక మాట్లాడాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేస్తూ, తన వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేస్తున్న వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

Rashmika | సోషల్ మీడియాలో గత కొన్నేళ్లుగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌, వ్యక్తిగత దాడులపై కన్నడ బ్యూటీ ర‌ష్మిక మంధాన‌ ఎట్టకేలకు స్పందించారు. ఎనిమిదేళ్లుగా మౌనంగా భరించిన ఈ వ్యవహారంపై ఇక మాట్లాడాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేస్తూ, తన వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేస్తున్న వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

ఇటీవల రష్మిక తల్లి సుమన్ మందన్నకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో లీక్ కావడం చర్చనీయాంశమైంది. ఆ ఆడియోలో రష్మిక,ర‌క్షిత్ శెట్టి మధ్య జరిగిన విభేదాలకు ప్రధాన కారణం ఆమె కెరీర్ అని చెప్పినట్లు వినిపిస్తోంది. పెళ్లి తర్వాత రష్మిక సినిమాలకు దూరంగా ఉండాలని రక్షిత్ కుటుంబం ఒత్తిడి తెచ్చిందని, ముఖ్యంగా గీత గోవిందం సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ తో చేసిన కిస్ సీన్‌పై కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ ఆడియోలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

హ‌ద్దులు దాటుతున్నాయి..

ఈ విషయంపై రష్మిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 24 గంటల్లో జరుగుతున్న పరిణామాలు హద్దులు దాటాయని ఆమె పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణను తన అనుమతి లేకుండా రికార్డ్ చేసి ఇప్పుడు లీక్ చేయడం చాలా బాధాకరమని తెలిపారు. వ్యూస్ మరియు పబ్లిసిటీ కోసం కొందరు కావాలని తనపై ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

తన కుటుంబ సభ్యులను కూడా ఈ వివాదంలోకి లాగడంపై రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉన్న ఆడియోలు, కంటెంట్‌ను వెంటనే తొలగించాలని మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అల్టిమేటం ఇచ్చారు. 24 గంటల్లోగా ఆ కంటెంట్ తొలగించాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుని సంబంధిత వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపిస్తాను” అని ఆమె హెచ్చరించారు. ఇది నా జీవితం. ఎలా ఉండాలో నిర్ణయించేది నేను మాత్రమే అని కన్నడలో కూడా గట్టిగా స్పందించారు. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది.

Latest News