KARNATAKA| కార్యకర్తపై సీఎం ఆగ్రహం.. అందుకే

కర్ణాటక రాజకీయాలు ముఖ్యమంత్రి మార్పు ప్రచారం నేపథ్యంలో ఆసక్తికర మలుపులతో కొనసాగుతున్నాయి. సీఎం సిద్దరామయ్య ను మారుస్తారని.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఆ పదవిలో కూర్చోబెడుతారన్న ప్రచారానికి ఆజ్యం పోసేలా కన్నడ కాంగ్రెస్ రాజకీయం సాగిపోతుంది. తాజాగా మైసూర్ లో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటన ఈ ఎపిసోడ్ ను మరింత రక్తికట్టించింది

KARNATAKA| కార్యకర్తపై సీఎం ఆగ్రహం.. అందుకే

విధాత: కర్ణాటక రాజకీయాలు ముఖ్యమంత్రి మార్పు ప్రచారం నేపథ్యంలో ఆసక్తికర మలుపులతో కొనసాగుతున్నాయి. సీఎం సిద్దరామయ్య ను మారుస్తారని.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఆ పదవిలో కూర్చోబెడుతారన్న ప్రచారానికి ఆజ్యం పోసేలా కన్నడ కాంగ్రెస్ రాజకీయం సాగిపోతుంది. తాజాగా మైసూర్ లో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటన ఈ ఎపిసోడ్ ను మరింత రక్తికట్టించింది.

మైసూర్ లో జరిగిన కార్యక్రమానికి సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలు సహా పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీకే తన ప్రసంగం అయిపోగానే తనకు పని ఉందంటూ మధ్యలోని లేచి బెంగుళూరు వెళ్లిపోయారు. తర్వాత సీఎం సిద్దరామయ్య తన ప్రసంగం ప్రారంభంలో వేదికపై ఉన్న ప్రముఖుల పేర్లు ప్రస్తావించారు. ఓ కార్యకర్త డిప్యూటీ సీఎం డీకే పేరును ప్రస్తావించలేదంటూ గుర్తు చేశారు. దీంతో అసహనానికి గురైన సిద్దరామయ్య అతడిపై ఆగ్రహించారు. శివకుమార్‌ ఇక్కడ లేరు కదా? ఆయన బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వారి గురించి కాదు.. వేదికపై ఉన్న నేతల పేర్లను ప్రస్తావించాలని..ఇంట్లో కూర్చున్న వారి గురించి కాదన్నారు. ఇక్కడ ఉన్నవారికి ఆహ్వానం పలకాలి. అదే ప్రొటోకాల్‌.. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అని అసహనం వ్యక్తం చేశారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం సీఎం మార్పుపై పరోక్ష సంకేతాలిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా అయ్యాయి. తను హాజరైన టీచర్ల కార్యక్రమంలో ఖాళీ సీట్లు ఉండటం..సమావేశంలో కొందరు నిలబడటం గమనించిన శివకుమార్ కుర్చీ దొరికితే వదలొద్దని..ఆ కుర్చీ కోసం తామెంతో కష్టపడ్డామంటూ పరోక్షంగా సీఎం పదవిపై తన మనసులోని మాటలు వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తర్వాత పార్టీలో సీనియర్ అయిన సిద్దరామయ్యను కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం పదవికి ఎంపిక చేసింది. అయితే, రెండున్నరేళ్ల తర్వాత ఆ పదవిని డీకే శివకుమార్ కు ఇవ్వాలన్న అవగాహాన ఉందన్న ప్రచారం అప్పటి నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం మార్పు ఉంటుందని ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నమ్ముతున్నారు. అయితే సిద్ధరామయ్య మాత్రం ఇక్కడ కుర్చీ ఖాళీ లేదంటూ సీఎం మార్పు ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

KTR Vs Jaggareddy| కేటీఆర్ పై జగ్గారెడ్డి సెటైర్లు

Dulquer Salmaan | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హీరో దుల్కర్ సల్మాన్