Errabelli Swarna| రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవహారాల కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

  • By: TAAZ |    telangana |    Published on : Mar 06, 2026 9:42 PM IST
Errabelli Swarna| రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Errabelli Swarna| తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవహారాల కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. వెలమ సామాజికవర్గానికి చెందిన స్వర్ణ గతంలో వరంగల్ నగర మేయర్ బాధ్యతలు నిర్వహించారు. మొన్నటి వరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన స్వర్ణ… భర్త వరదరాజేశ్వర్ రావు అడుగుజాడల్లో పార్టీలో పనిచేస్తూ వచ్చారు. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో వర్ధన్నపేట పీఎసీఎస్ ప్రెసిడెట్‌గా, కార్పొరేటర్‌గా గెలుపొందారు. గతంలో రాష్ట్ర, జాతీయ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల ఆమె అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.