Karnataka CM change| మా మధ్య విబేధాలు లేవు: సీఎం సిద్దరామయ్య, డీకేల ఉమ్మడి ప్రకటన

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై తీవ్ర చర్చ జరుగుతున్న ప్రచారంపై స్పష్టతనిచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ శనివారం ఉదయం భేటీ అయ్యారు. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ అనంతరం వారిద్దరూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం మార్పు ఉహగానాలను తోసిపుచ్చారు. మా మధ్య విబేధాలు లేవని..హైకమాండ్ నిర్ణయమే తమకు శిరోధార్యమని ప్రకటించారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Nov 29, 2025, 11:52 am IST
Read Time: 4 mins
Karnataka CM change| మా మధ్య విబేధాలు లేవు: సీఎం సిద్దరామయ్య, డీకేల ఉమ్మడి ప్రకటన

న్యూఢిల్లీ : కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు(Karnataka CM change)పై తీవ్ర చర్చ జరుగుతున్న ప్రచారంపై స్పష్టతనిచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar) శనివారం ఉదయం భేటీ అయ్యారు. బ్రేక్‌ఫాస్ట్‌ భేటీ(Breakfast meeting)గా పేర్కొన్న ఈ సమావేశంలో సీఎం మార్పు..రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను చర్చించారు. ఈ భేటీ అనంతరం సీఎం సిద్దరామయ్య, డీకేఎస్ లు ఉమ్మడిగా ప్రెస్ మీట్(Joint press meet) నిర్వహించి సీఎం మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ బాగుందంటూ కామెంట్ చేశారు. సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. సీఎం మార్పుపై నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే తాము బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నామని తెలిపారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి బేధాభిప్రాయలు లేవని..గతంలో లేవని, ఇప్పుడు లేవని తెలిపారు. సీఎం మార్పుపై కాంగ్రెస్ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం అని స్పష్టం చేశారు. 2028 ఎన్నికల స్ట్రాటజీపై చర్చించాం అని.. 2028 ఎన్నికల్లో గెలవడం మాకు ముఖ్యం అని సిద్ధరామయ్య వెల్లడించారు. మేం ఇద్దరం పార్టీ కోసం కలిసి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూర్చొని మాట్లాడుకోవాలని సూచించిందని..అందుకే కలిశాం అని తెలిపారు. సీఎం మార్పు అంటూ బీజేపీ, జేడీఎస్ మీడియా వదంతులు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. సీఎం మార్పు వ్యవహారంలో కాంగ్రెస్ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామన్నారు. మేమిద్దరం కలిసే ఉన్నాం అనే సందేశం ఈ సమావేశం ద్వారా ఇస్తున్నాం అన్నారు. మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు లేవు అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో ఎలాంటి క్యాంప్ రాజకీయాలు లేవు అని స్పష్టం చేశారు. హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహిస్తామని..అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడబోమని చెప్పారు. మాపై కర్ణాటక ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. పార్టీని పటిష్టం చేయడమే మాకు అత్యంత ప్రాధాన్యత అంశమని, పార్టీ కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామని తెలిపారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మా లక్ష్యం అన్నారు.