విధాత, హైదరాబాద్ : కూతురు కొండా సుస్మితా పటేల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలతో సీఎం రేవంత్ రెడ్డితో దెబ్బతిన్న బంధాలను పునరుద్దరించుకునేందుకు మంత్రి కొండా సురేఖకు రక్షా బంధన్ పండుగ వేదికైంది. రాఖీ కడుతాను సోదరా!..అపాయింట్మెంట్ ఇవ్వడని మంత్రి కొండా సురేఖ కోరిందే తడువుగా..రా సోదరీ..! అంటూ రేవంత్ తలుపులు తెరవడంతో రాఖీ పర్వదినం రాజీ మార్గానికి బాటలేసింది. రేవంత్ అపాయిట్మెంట్ లభించడంతో మంత్రి కొండా సురేఖ సీఎం ఇంటికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించింది. అంతకుముందుగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి తన అప్యాయతను చాటుకున్నారు.
ఇటీవల తన కూతురు కొండా సుస్మిత పరకాల టికెట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో మంత్రి కొండా సురేఖకు, రేవంత్ రెడ్డి మధ్య దూరం పెరిగింది. రేవంత్ రెడ్డి లండన్ పర్యటన నుంచి వచ్చాక కూడా మంత్రి సురేఖ ఆయనను కలవలేదు. ఇంతలోనే పీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలంటూ నివేదిక అందించింది. ఈ వివాదం నేపథ్యంలో రేవంత్–సురేఖ రక్షా బంధన్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాఖీ తంతుతో వారి మధ్య అనుబంధం మళ్లీ పునరుద్దరించబడిందా..వారు ఈ సందర్భంగా ఏం మాట్లాడుకున్నారన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
రేవంత్ వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో రాఖీ పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఆమె రాఖీ కట్టడంతో వారి మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగినట్లేనా? అన్న చర్చ జోరందుకుంది.
ఆడబిడ్డలపై సీఎం ఆశీస్సులు ఉండాలి : కొండా సురేఖ
సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు నాతో పాటు రాష్ట్రంలోని ఆడబిడ్డలందరిపై ఉండాలని సురేఖ చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ తో పాటు మనుమడికి, అల్లుడికి బంగారు రాఖీలు కట్టానని, గత మూడేళ్లుగా రేవంత్ అన్నకు రాఖీలు కడుతూ వస్తున్నానని తెలిపారు. కూతురు సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో నెలకొన్న వివాదం సందర్బంగా మంత్రి పదవి విషయంలో మీకు ఏదైనా భరోసా దొరికిందా అన్న మీడియా ప్రశ్నలకు…ఈ రోజు నేను ఎలాంటి రాజకీయాలు మాట్లాడబోనని చెప్పారు.
రాఖీ పండుగ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన మంత్రులు దానసరి సీతక్క, కొండా సురేఖ
On the occasion of Rakhi, Ministers Seethakka and Konda Surekha tied a Rakhi to CM Revanth Reddy#RevanthReddy #KondaSurekha #Seethakka
• @seethakkaMLA
• @iamkondasurekha pic.twitter.com/iPRFDIKaP2— Congress for Telangana (@Congress4TS) August 28, 2026