Meena| మంచు కొండ‌ల్లో మీనా.. పుష్ప సాంగ్‌కి డ్యాన్స్ చేసి పిచ్చెక్కించిందిగా..!

Meena|  మ‌న తెలుగు సినిమా పాట‌లు ఇటీవ‌లి కాలంలో ప్ర‌పంచం మొత్తాన్ని ఊపేస్తున్నాయి. కొన్ని సినిమా పాట‌ల‌కి విదేశీయులు కూడా చిందులు వేయ‌డం, అవి నెట్టింట్లో వైరల్ అవుతుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఇక ఇటీవ‌ల పుష్ప2 నుండి విడుద‌లైన పుష్ప పుష్ప పుష్పరాజ్ అనే పాట

  • Publish Date - May 20, 2024 / 06:39 AM IST

Meena|  మ‌న తెలుగు సినిమా పాట‌లు ఇటీవ‌లి కాలంలో ప్ర‌పంచం మొత్తాన్ని ఊపేస్తున్నాయి. కొన్ని సినిమా పాట‌ల‌కి విదేశీయులు కూడా చిందులు వేయ‌డం, అవి నెట్టింట్లో వైరల్ అవుతుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఇక ఇటీవ‌ల పుష్ప2 నుండి విడుద‌లైన పుష్ప పుష్ప పుష్పరాజ్ అనే పాట మంచి క్రేజ్ ద‌క్కించుకుంది.ఇటీవ‌ల వర్డల్ ఫేమస్ యూట్యూబర్ ముంబై లోకన్ ట్రైన్ లో పుష్ప సాంగ్ కి స్టెప్పులు వేయ‌గా, దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అయింది.ఓ బామ్మ సైతం ఈ పాట‌కి చిందులు వేయ‌డం విశేషం. అయితే తాజాగా సీనియ‌ర్ న‌టి మీనా కూడా ఈ పాట‌కి కాలు క‌ద‌ప‌డం విశేషం.

పుష్ప 2 సినిమా నుంచి రిలీజ్ అయిన‌ పుష్ప పుష్ప సాంగ్‌లో బ‌న్నీ చెప్పు వదిలేసి కాలు మీద కాలు వేసుకొని చేసే స్టెప్పు ఎంత‌గా వైర‌ల్ అయిందో మ‌నం చూశాం. ఇప్పుడు అదే స్టెప్‌ని మీనా కూడా వేసి అద‌ర‌గొట్టింది. స‌మ్మ‌ర్ వెకేష‌న్‌లో భాగంగా యూరప్ లోని ఐస్ ల్యాండ్ కి వెకేషన్ కి వెళ్ళింది. ఐస్ ల్యాండ్ మంచులో మీనా పుష్ప సాంగ్ స్టెప్ చేసి అందుకు సంబంధించిన రీల్‌ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దానికి కామెంట్‌గా మంచు, నిప్పు అదిరిపోయే కాంబినేషన్ అని పోస్ట్ చేసింది. పుష్ప స్టెప్ వేసిన మీనాని ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకుంటున్నారు. సుమారు 30 ఏళ్ల పాటు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మీనా జీవితంలో కొద్ది నెల‌ల క్రితం ఓ విషాద సంఘ‌ట‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే.

మీనా భర్త విద్యా సాగర్ హఠాన్మరణం చెందారు. దీంతో మీనా, ఆమె కూతురు నైనా ఒంటరివారైపోయారు.అయితే మీనా రెండో పెళ్లి చేసుకుంటుంద‌ని ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారాలు సాగాయి. వాటిని మీనా ఖండిస్తూ వ‌స్తుంది. అయిన కూడా ప్ర‌చారాలు ఆగ‌డం లేదు. ఇక పుష్ప 2 విష‌యానికి వ‌స్తే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాని ఆగ‌స్ట్ 15న రిలీజ్ చేయ‌బోతున్నారు.ఈ క్ర‌మంలోనే మూవీకి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు. పుష్ప‌ని మించి పుష్ప‌2 హిట్ అవుతుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

Latest News