Movie Theaters| సినీ ల‌వర్స్‌కి ఇది పెద్ద షాకింగ్ న్యూస్.. రెండు వారాల పాటు థియేట‌ర్స్ బంద్

Movie Theaters|  స‌మ్మ‌ర్ సీజ‌న్ సినీ ప‌రిశ్ర‌మ‌కు పెద్ద షాక్ ఇచ్చింది. సాధార‌ణంగా స‌మ్మ‌ర్‌లో పెద్ద ఎత్తున సినిమాలు విడుద‌ల అవుతుండ‌డం మ‌నం చూస్తూ ఉంటాం. కాని ఈ సారి

  • Publish Date - May 15, 2024 / 11:29 AM IST

Movie Theaters|  స‌మ్మ‌ర్ సీజ‌న్ సినీ ప‌రిశ్ర‌మ‌కు పెద్ద షాక్ ఇచ్చింది. సాధార‌ణంగా స‌మ్మ‌ర్‌లో పెద్ద ఎత్తున సినిమాలు విడుద‌ల అవుతుండ‌డం మ‌నం చూస్తూ ఉంటాం. కాని ఈ సారి మాత్రం ఎందుకో సినిమాల సంద‌డి క‌రువైంది. ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండ‌డం వ‌ల‌న పెద్ద పెద్ద సినిమాలు సమ్మ‌ర్ రేసు నుండి త‌ప్పుకున్నాయి. ఈ క్ర‌మంలో చిన్న చిత‌కా సినిమాలు మాత్ర‌మే థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తున్నాయి. అయితే ఈ సినిమాల‌కి పెద్ద‌గా ఆద‌ర‌ణ క‌నిపించ‌డం లేదు.

ఇక సింగిల్ స్క్రీన్స్ లో వేసే చిన్న సినిమాల కోసం థియేట‌ర్స్‌కి ప్రేక్ష‌కులు పెద్ద‌గా రావ‌డం లేదు. క‌రెంట్, రెంట్ ల ఖ‌ర్చులు కూడా మిగ‌ల‌డం లేదు. దీంతో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఓ నిర్ణయానికి వచ్చాయి. సమ్మర్ అయిపోయే వరకు ఓ పది రోజులు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ నిర్ణ‌యం వ‌ల‌న చిన్న‌సినిమాల‌కి కూడా బ్రేక్ ప‌డింద‌ని చెప్పాలి. రాజు యాదవ్, లవ్ మీ సినిమాలతో పాటు మరి కొన్ని చిన్న సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉండ‌గా, ఇప్పుడు వారు తీసుకున్న నిర్ణ‌యంతో చిన్న సినిమా నిర్మాత‌ల‌కి పెద్ద షాక్ త‌గిలింద‌నే చెప్పాలి.

ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటం వల్లే సినిమా ప్రదర్శనలు ఆపాలని తీసుకున్న నిర్ణ‌యం చిన్న సినిమాల‌కి చాలా పెద్ద దెబ్బ అవుతుంద‌ని అంటున్నారు. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.

Latest News