Allu Arjun Atlee Film : అల్లు అర్జున్ – ఆట్లీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

అల్లు అర్జున్, దర్శకుడు ఆట్లీ కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ లక్ష్యంగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్, యాక్షన్ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణే, రష్మిక, జాన్వీకపూర్ సహా పలువురు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నట్లు టాక్.

Allu Arjun Atlee Film

విధాత : అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు ఆట్లీ రూపొందిస్తున్న సినిమా షూటింగ్ లోని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చింది. పాన్ వరల్డ్ టార్గెట్ గా రూపొందతున్న ఈ సైన్స్ ఫిక్షన్..యాక్షన్ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణేతో పాటు రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే, జాన్వీకపూర్ కూడా నటిస్తున్నట్లుగా టాక్. మానవులకు, గ్రహాంతరవాసులకు మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో అట్లీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

సన్ పిక్చర్స్‌ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. హాలీవుడ్‌లోని అతిపెద్ద వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్రం కోసం చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ఓ పాత్రలో మెరువబోతున్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఈ సినిమా షూటింగ్ సెట్ ను సందర్శించి ఆట్లీ సినిమా భారత చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త గా రాబోతుందని ప్రశంసించడం గమనార్హం.