Naga Chaitanya | నాగచైతన్య గ్యారేజ్‌లోకీ మరో లగ్జరీ కార్‌.. పోర్షే 911 జీటీ3 ఆర్‌ఎస్‌ ధరే రూ.3.51 కోట్లు..!

Naga Chaitanya | టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో మరో లగ్జరీ కారు చేరింది. దీని ధర తెలిస్తే అందరూ షాక్‌ అవుతారు. పోర్షే కంపెనీకి చెందిన 911 జీఆర్‌3 ఆర్‌ఎస్‌ ఆర్‌ఎస్‌ మోడల్‌ కారును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు. నాగచైతన్యకు కార్లు, బైక్‌లు అంటే ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే.

  • Publish Date - May 22, 2024 / 07:56 AM IST

Naga Chaitanya | టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో మరో లగ్జరీ కారు చేరింది. దీని ధర తెలిస్తే అందరూ షాక్‌ అవుతారు. పోర్షే కంపెనీకి చెందిన 911 జీఆర్‌3 ఆర్‌ఎస్‌ ఆర్‌ఎస్‌ మోడల్‌ కారును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు. నాగచైతన్యకు కార్లు, బైక్‌లు అంటే ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌ నటుడు కొనుగోలు చేసిన ఈ కారు ధర ఎక్స్‌షోరూం ధరనే అక్షరాలా రూ.3.51కోట్లు. సిల్వర్‌ కలర్‌ని తీసుకున్నారు. చెన్నై సెంట్రల్‌లోని పోర్షే డీలర్‌షిప్‌ షోరూం ద్వారా ఆయన ఈ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ‘పోర్షే ఫ్యామిలీలోకి నాగ చైతన్యని ఆస్వానిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. పోర్షే 911 జీటీ3 ఆర్​ఎస్​ని డెలివరీ చేయడం హ్యాపీగా ఉంది. రేస్​ ట్రాక్‌లో.. ట్రాక్​ బయట ఆయనకు ఈ కారుతో మంచి జ్ఞాపకాలు కలగాలని కోరుకుంటున్నాం’ అని పోర్షే డీలర్​షిప్ ​షోరూం సోషల్​ మీడియాలో పోస్ట్‌ పెట్టింది.

సమాచారం ప్రకారం నాగచైతన్య కొనుగోలు చేసిన పోర్షే 911 జీటీ3 ఆర్​ఎస్​ కారు రిజిస్ట్రేషన్​ మే 17న జరిగింది. హైదరాబాద్​లో ఇదే తొలి పోర్షే 911 జీటీ3 ఆర్​ఎస్​ అని సమాచారం. గతంలో ఈ మోడల్‌ కారు హైదరాబాద్‌ రోడ్లపై కనిపించలేదు. ఇక కారు ఫీచర్స్‌ విషయానికి వస్తే పోర్షే 911 జీటీ3 ఆర్​ఎస్​ టాప్​ స్పీడ్​ 296 కేఎంపీహెచ్ 0-100 కేఎంపీహెచ్​ని కేవలం 3.2 సెకన్లలో అందుకుంటుంది. పవర్​ఫుల్​ 3996 సీసీ, నేచురల్సీ ఆస్పిరేటెడ్​, పెట్రోల్​, 6 సిలిండర్​ ఫ్లాట్​, 4 వాల్వ్​, డీఓహెచ్​సీ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 518 బీహెచ్​పీ పవర్​ని, 465 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. మైలేజ్​ మాత్రం లీటర్‌కు 7.4 కిలోమీటర్లు వస్తుంది. పోర్షే 911 జీటీ3 ఆర్​ఎస్​ పొడవు 4572ఎంఎం, వెడెల్పు 1900ఎంఎం. ఎత్తు 1322ఎంఎం. వీల్​బేస్​ వచ్చేసి 2457ఎంఎం. కర్బ్​ వెయిట్​ 1450 కేజీలు ఉంటుంది.

కారులో ఓవర్​స్పీడ్​ వార్నింగ్​, లేన్​ డిపార్చర్​ వార్నింగ్​, ఎమర్జెన్సీ బ్రేకింగ్​ లైట్​ ఫ్లాషింగ్​, పంచర్​ రిపైర్​ కిట్​, ఫార్వర్డ్​ కొలిషన్​ వార్నింగ్​, ఆటోమెటిక్​ ఎమర్జెన్సీ బ్రేకింగ్​, హై బీమ్​ అసిస్ట్​, లేన్​ డిపార్చర్​ ప్రివెన్షన్​, 7 ఎయిర్​బ్యాగ్స్​, ఏబీఎస్​, ఈబీడీ తదితర సేఫ్టీ ఫీచర్స్​ సైతం ఉన్నాయి. ఇక నాగచైతన్య గ్యారేజ్‌లో ఇప్పటికే రూ.3.88 కోట్ల విలువైన ఫెరారీ 488జీటీబీ ఉంది. అలాగే, బీఎండబ్ల్యూ 740 ఎల్​ఐ (రూ.1.30 కోట్లు) 2ఎక్స్​ ల్యాండ్​ రోవర్​ రేంజ్​ రోవర్​ వేగ్యూ (రూ.1.8 కోట్లు) నిస్సాన్​ జీటీ ఆర్​ (రూ. 2.12 కోట్లు) మెర్సిడీస్​ బెంజ్​ జెడ్​ క్లాస్​ జీ 63 ఏఎంజీ (రూ.2.28 కోట్లు), ఎంవీ ఆగస్త్య ఎఫ్​4 (రూ.35లక్షలు) బీఎండబ్ల్యూ 9ఆర్​టీ (రూ.18.5 లక్షలు) మోడల్స్‌ ఉన్నాయి.

Latest News