Naga Chaitanya | టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో మరో లగ్జరీ కారు చేరింది. దీని ధర తెలిస్తే అందరూ షాక్ అవుతారు. పోర్షే కంపెనీకి చెందిన 911 జీఆర్3 ఆర్ఎస్ ఆర్ఎస్ మోడల్ కారును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. నాగచైతన్యకు కార్లు, బైక్‌లు అంటే ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే.
Naga Chaitanya | టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో మరో లగ్జరీ కారు చేరింది. దీని ధర తెలిస్తే అందరూ షాక్ అవుతారు. పోర్షే కంపెనీకి చెందిన 911 జీఆర్3 ఆర్ఎస్ ఆర్ఎస్ మోడల్ కారును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. నాగచైతన్యకు కార్లు, బైక్‌లు అంటే ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే. టాలీవుడ్ నటుడు కొనుగోలు చేసిన ఈ కారు ధర ఎక్స్‌షోరూం ధరనే అక్షరాలా రూ.3.51కోట్లు. సిల్వర్ కలర్‌ని తీసుకున్నారు. చెన్నై సెంట్రల్‌లోని పోర్షే డీలర్షిప్ షోరూం ద్వారా ఆయన ఈ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ‘పోర్షే ఫ్యామిలీలోకి నాగ చైతన్యని ఆస్వానిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ని డెలివరీ చేయడం హ్యాపీగా ఉంది. రేస్ ట్రాక్‌లో.. ట్రాక్ బయట ఆయనకు ఈ కారుతో మంచి జ్ఞాపకాలు కలగాలని కోరుకుంటున్నాం’ అని పోర్షే డీలర్షిప్ షోరూం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
సమాచారం ప్రకారం నాగచైతన్య కొనుగోలు చేసిన పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ కారు రిజిస్ట్రేషన్ మే 17న జరిగింది. హైదరాబాద్‌లో ఇదే తొలి పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ అని సమాచారం. గతంలో ఈ మోడల్ కారు హైదరాబాద్ రోడ్లపై కనిపించలేదు. ఇక కారు ఫీచర్స్ విషయానికి వస్తే పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ టాప్ స్పీడ్ 296 కేఎంపీహెచ్ 0-100 కేఎంపీహెచ్ని కేవలం 3.2 సెకన్లలో అందుకుంటుంది. పవర్ఫుల్ 3996 సీసీ, నేచురల్సీ ఆస్పిరేటెడ్, పెట్రోల్, 6 సిలిండర్ ఫ్లాట్, 4 వాల్వ్, డీఓహెచ్సీ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 518 బీహెచ్పీ పవర్‌ని, 465 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. మైలేజ్ మాత్రం లీటర్‌కు 7.4 కిలోమీటర్లు వస్తుంది. పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్ పొడవు 4572ఎంఎం, వెడెల్పు 1900ఎంఎం. ఎత్తు 1322ఎంఎం. వీల్‌బేస్ వచ్చేసి 2457ఎంఎం. కర్బ్ వెయిట్ 1450 కేజీలు ఉంటుంది.
కారులో ఓవర్‌స్పీడ్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ లైట్ ఫ్లాషింగ్, పంచర్ రిపైర్ కిట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, 7 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ తదితర సేఫ్టీ ఫీచర్స్ సైతం ఉన్నాయి. ఇక నాగచైతన్య గ్యారేజ్‌లో ఇప్పటికే రూ.3.88 కోట్ల విలువైన ఫెరారీ 488జీటీబీ ఉంది. అలాగే, బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ (రూ.1.30 కోట్లు) 2ఎక్స్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేగ్యూ (రూ.1.8 కోట్లు) నిస్సాన్ జీటీ ఆర్ (రూ. 2.12 కోట్లు) మెర్సిడీస్ బెంజ్ జెడ్ క్లాస్ జీ 63 ఏఎంజీ (రూ.2.28 కోట్లు), ఎంవీ ఆగస్త్య ఎఫ్4 (రూ.35లక్షలు) బీఎండబ్ల్యూ 9ఆర్టీ (రూ.18.5 లక్షలు) మోడల్స్ ఉన్నాయి.