Top Celebrities In Betting App Case: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్.. బుక్కైన టాప్ సెలబ్రెటీలు!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో టాలీవుడ్ ప్రముఖ హీరో, హీరోయిన్లు సహా 25మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయర్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన టాలీవుడ్ హీరో, హీరోయిన్లపై కూడా కేసు నమోదు చేశారు.

Top celebrities in betting app case:
బెట్టింగ్ యాప్స్ కేసుపై ఉక్కు పాదం మోపుతున్న పోలీస్ శాఖ ఈ రోజ టాప్ సెలబ్రెటీలపై కూడా కేసు నమోదు చేసింది. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు 11మందిపై కేసు నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణ సైతం కొనసాగిస్తున్నారు. ఇప్పడు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కోర్టు ఆదేశాల మేరకు ఫణింద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు టాలీవుడ్ ప్రముఖ హీరో, హీరోయిన్లు సహా 25మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయర్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన టాలీవుడ్ హీరో, హీరోయిన్లపై కూడా కేసు నమోదు చేశారు. వారిలో ఏ1 నుంచి ఏ6వరకు దగ్గుబాటి రాణా, ప్రకాశ్ రాజ్, విజయదేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రణిత, నిధి అగర్వాల్ లపై కేసు నమోదు చేశారు. అనన్య నాగెళ్ల, యాంకర్లు శ్రీముఖి, వర్షిణి, సిరి హన్మంత్, వంశీ సౌందర్య రాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయిని పావనిలపై కేసు నమోదు చేశారు. నేహా పతాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ, నటి శ్యామలపై కేసు నమోదు చేశారు. టేస్టీ తేజ, బండారు శేష సుకృతి, రీతు చౌదరిలపై కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వారిపై గ్యాంబ్లింగ్, బెట్టింగ్, కేసినో యాప్స్ ప్రమోషన్ చేసినందుకు 318(4), 112రెడ్ విత్, బీఎన్ఎస్ 3, 3ఏ,4, ఐటీ యాక్ట్ 66డీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నిందితుల విచారణ షురూ!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో నిందితులు టెస్టీ తేజా, విష్ణుప్రియలు గురువారం పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియ తన న్యాయవాది లక్ష్మణ్ తో కలిసి పంజాగుట్ట పీఎస్ కు వచ్చి విచారణకు హాజరయ్యారు. నిన్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు ఈ రోజు టెస్టీ సన్నీ, విష్ణుప్రియల స్టెట్మెంట్ రికార్డు చేశారు. కేసులో ఉన్న అజయ్, సుధీర్, శ్యామల, రీతు చౌదరీ, సుప్రీత్ లకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసినందనా వారు కూడా విచారణకు హాజరుకావాల్సి ఉంది.