Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులో మంచు లక్ష్మీ, రీతూ, సన్నీల విచారణ
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటి మంచు లక్ష్మి, రీతూ చౌదరి, యూట్యూబర్ సన్నీ యాదవ్‌లను సీఐడీ అధికారులు విచారించారు. ప్రమోషన్ల కోసం తీసుకున్న నగదుపై వారిని ప్రశ్నించారు.
విధాత, హైదరాబాద్ : ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ నటి మంచు లక్ష్మీ, టీవీ నటి రీతూ చౌదరి, యూ ట్యూబర్ భయ్య సన్నీ యాదవ్ లను మంగళవారం సీఐడీ విచారించింది. హైదరాబాద్ లక్డీకపూల్ సీఐడీ కార్యాలయంలో వారిని సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. మొత్తం 25 మందిపై ఎఫ్ఐఆర్ ల ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రెటీలు లక్షల్లో డబ్బులు తీసుకున్నారని…మనీలాండరింగ్ లో భాగస్వామ్యం అయ్యారని అభియోగాలు మోపింది.
నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఆ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై అధికారులు ఆ ముగ్గురిని ప్రశ్నించారు. ఇదే కేసులో హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, నటి అమృత చౌదరిలను కూడా ఇంతకుముందే సీఐడీ అధికారులు విచారించారు.
గతంలో ఈ కేసు విషయంలో మంచు లక్ష్మిని ఈడీ కూడా విచారించిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్‌రాజ్‌లు కూడా గతంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. సెలబ్రిటీల ప్రచారం కారణంగా సామాన్యులు ఈ బెట్టింగ్ యాప్‌ల బారిన పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
AI Replacing Software Jobs | ‘ఏఐ’తో లక్షల ఉద్యోగాలు ఊస్ట్.. తీవ్ర ఒత్తిడిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు!
Large Sinkhole In UK : భూమి బద్దలైందా ! కాలువ కింద భారీ హోల్..తప్పిన ప్రాణనష్టం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram