AI Replacing Software Jobs | ‘ఏఐ’తో లక్షల ఉద్యోగాలు ఊస్ట్.. తీవ్ర ఒత్తిడిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్న కృత్రిమ మేథ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వేల మందిని వివిధ కంపెనీలు తొలగిస్తున్నాయి.
software engineers layoffs representational image AI Creation
AI Replacing Software Jobs | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. సాఫ్ట్‌వేర్ రంగాన్ని కుదిపేస్తున్నది. ఇప్పటి వరకు సంప్రదాయ పద్ధతిలో పనిచేసుంటూ వెళ్తున్న నిపుణులను కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నది. ఏఐ టెక్నాలజీ ఐటీ పరిశ్రమ గతినే మార్చివేస్తున్నది. ఆర్థిక వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు ఏఐలో ఇతర సంస్థలో పోటీ పడేందుకు పలు టెక్ కంపెనీలు 2024 సంవత్సరంలో ఉద్యోగాల కోత విధించాయి. పది మంది చేసే పనిని ఏఐ పూరించడం మూలంగా వందల మంది నిపుణుల అవసరం లేకుండా పోతోంది. 2025 సంవత్సరంలో కూడా లక్షలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు. ఒక్క అమెరికా దేశంలో 2025 లో 55 వేల మంది సాఫ్ట్‌వేర్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారని కన్సల్టింగ్ సంస్థ చాలెంజర్ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా యుఎస్ కు చెందిన సంస్థలు అక్టోబర్ నెలలో 1.53 లక్షల మందిని, నవంబర్ నెలలో 71వేల మందిపై వేటు వేశాయి. పెట్టిన పెట్టుబడికి సరిపడా డబ్బులు రాకపోవడం, ఆదాయం తగ్గిపోవడం, ద్రవ్యలోటు, ప్రభుత్వ టారిఫ్ ల కారణంగా పలు సంస్థలు పోటీపడి తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఏఐ తప్ప మరో మార్గం టెక్ కంపెనీలకు కన్పించడం లేదు. ప్రస్తుతం అమెరికా దేశంలో ఏఐ టూల్స్ 11.7 శాతం పనులు చేస్తున్నాయి. ఫైనాన్స్, హెల్త్ కేర్, ఇతర సర్వీసు రంగాలలో ఏఐ వినియోగం కారణంగా 1.2 ట్రిలియన్ డాలర్ల మేర టెక్ కంపెనీలు జీతాల చెల్లింపులో ఆదా చేసుకున్నట్లు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఒక అధ్యయన నివేదికను కూడా ప్రచురించింది.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ఈ ఏడాది అక్టోబర్ నెలలో 14వేల మంది సాఫ్ట్‌వేర్ నిపుణులకు పింక్ స్లిప్స్ ఇచ్చింది. 14వేల మందిలో సుమారు వేయి మంది వరకు ఇండియన్ వర్కర్లు ఉన్నారు. మున్ముందు మరింత మందిని తగ్గించుకునే ఆలోచనలో అమెజాన్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు ప్రణాళికలు రూపొందించుకున్నదని అంటున్నారు. వర్కర్ల కన్నా వేగంగా ఏఐ టూల్స్ పనిచేస్తుండడం, ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తరువాత ఇంత వేగం ఎప్పుడు చూడకపోవడం కూడా తొలగింపుకు కారణంగా చెబుతున్నారు. తమ వినియోగదారులకు సత్వర సేవలు, వేగంగా అందించేందుకు ఏఐ వినియోగిస్తున్నామని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెట్టి వెల్లడించారు. ఏఐ మూలంగా కంపెనీలో వర్కర్లు తగ్గవచ్చని, ఇది తమ లాంటి సంస్థలకు ఎంతో అవసరమని అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ కొద్ది నెలల క్రితం హెచ్చరించిన విషయం తెలిసిందే. కొద్ది మంది కొన్ని పనులు ఈ రోజే చేస్తారని, చాలా మంది వర్కర్లు ఇతర పనులు చేస్తారని ఉదహరించారు.
2025 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ కూడా 15వేల మందిపై వేటు వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్కర్లలో 4 శాతం మందిని తొలగించింది. ఈ ఏడాది మే నెలలో 9వేలు, జూన్ లో 300, జూలై నెలలో 6వేల మందిని ఇంటికి పంపించారు. 2014లో 18వేల మందిని తొలగించిన సంస్థ, ఈ ఏడాది కూడా 15వేల మందిని తీసివేయక తప్పలేదు. ఈ తొలగింపులో అన్ని స్థాయిల్లో నిపుణులైన వారు తమ ఉద్యోగాలను కోల్పోయారు.
ఏఐ వినియోగంతో మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టూడియోస్, ఎక్స్ బాక్స్ విభాగాలను కుదిపేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో నాదేళ్ల సత్య ఇటీవల కంపెనీ వర్కర్లకు ఒక మెమో పంపించారు. విండోస్ తయారీదారు తన కొత్త యుగం కోసం లక్ష్యాన్ని పునర్ నిర్వచించుకోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.
సేల్స్‌ఫోర్స్ 4వేల మంది వర్కర్లను తొలగించి, ఏఐ ఏజెంట్ల ద్వారా ఆ బాధ్యతలను ఎగ్జిక్యూటివ్‌కు అప్పగించినట్లు ఆ సంస్థ సీఈవో మార్క్ బెనిఫ్ తెలిపారు. మొత్తం 9వేల మంది పనిచేస్తుండగా వారిలో నాలుగువేల మందిని తగ్గించుకున్నామన్నారు. ప్రస్తుతం తమ సంస్థలో ఏఐ 50 శాతం పనులు చేసి పెడుతోందని తెలిపారు.
క్లౌడ్ రంగంలో ప్రముఖంగా ఉన్న ఐబీఎం సంస్థ వేల మందిని తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నవంబర్ నెలలో ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 2.70 లక్షల మంది ఎంప్లాయీస్ ఉండగా, ఒక శాతం అనగా 2,700 మందిని ఈ ఏడాది తొలగించారు. వందల మంది ఉద్యోగులు చేసే పనిని ఏఐ చాట్ బాట్ చేస్తున్నదని కంపెనీ సీఈఓ అరవింద్ తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, సేల్స్, మార్కెటింగ్ రంగాలలో నియామకాలు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నాయమని ఆయన వివరించారు.
క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ కూడా తమ వర్కర్లలో ఐదు శాతం.. అనగా ఐదు వందల మందికి పింక్ స్లిప్ప్ ఇచ్చింది.
ఇంటెల్ సంస్థ కూడా 2025 చివరి నాటికి 24వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
వర్క్ డే తమ సంస్థలో పనిచేస్తున్న వారిలో 8.5 శాతం మంది తీసివేస్తున్నామని ఫిబ్రవరి లో ప్రకటించి, ఆ ప్రకారంగానే 1,750 మందిని తొలగించారు. ఏఐ విస్తరణలో భాగంగా తొలగింపులు అనివార్యమని వర్క్ డే సీఈఓ కార్ల్ ఎషెన్ బాక్ వ్యాఖ్యానించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏఐ పుణ్యమా అని తొలగించిన వారి కంపెనీల జాబితా చాంతాడంత ఉంది.
Read Also |
Artificial Intelligence | ఏఐని మితిమీరి వాడుతున్నారా? అయితే భవిష్యత్తులో మీ పరిస్థితి అథోగతే!
Artificial Intelligence | వామ్మో.. కృత్రిమ మేధతో ఇన్ని డేంజర్లా? నశించనున్న మానవ మేధ!
AI Job Disruption | ఏఐ ఎఫెక్ట్.. ముందువరుసలో జర్నలిస్టులు, అనువాదకులు, రచయితలు! ఎఫెక్ట్‌లేని టాప్ టెన్ ఉద్యోగాలేంటి?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram