Artificial intelligence | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంపన్నుల చేతుల్లో ఆయుధం..!
Artificial intelligence | ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) నామస్మరణ జరుగుతోంది. ఇది మంచి కన్నా కీడే ఎక్కువగా చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహిత జెఫ్రీ ఎవరెస్టు హింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Artificial intelligence | ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) నామస్మరణ జరుగుతోంది. ఇది మంచి కన్నా కీడే ఎక్కువగా చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహిత జెఫ్రీ ఎవరెస్టు హింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ సంపన్నుల చేతుల్లో ఆయుధంగా మారుతుందని, తక్కువ పెట్టుబడితో ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తారని, టెక్ నిపుణులను భారీగా తొలగిస్తారని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తు టెక్ ప్రపంచ ఎలా ఉండబోతున్నదనేది హింటన్ వెల్లడించారు.
బ్రిటీష్-కెనడియన్ జాతీయుడైన జెఫ్రీ ఎవరెస్టు కంప్యూటర్ సైంటిస్టు, కాగ్నిటివ్ సైకాలజిస్టు, నోబెల్ బహుమతి గ్రహీత. ఏఐ న్యూరల్ నెట్ వర్క్ లపై చేసిన పరిశోధనలకు ఆయన ప్రసిద్ధి చెందాడు. ఏఐ భవిష్యత్తులో తీవ్ర ముప్పును కలిగించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్నులు, బడా పారిశ్రామిక వేత్తలు ఏఐని ఉపయోగించి, ఉద్యోగుల సంఖ్యను అమాంతం తగ్గించడం, కొత్త నియామకాలు నిలిపివేస్తారని హింటన్ కొద్ది రోజుల క్రితం ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల నిరుద్యోగం ఊహించని స్థాయికి చేరుకుంటుందని, అంచనాలకు అందని విధంగా కంపెనీల యజమానులు దండిగా లాభాలు సంపాదిస్తారన్నారు. ఫలితంగా కొద్ది మంది సంపన్నులుగా మారుతారని, 90 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగజారుతారని, ఇది ఏఐ తప్పిదం కాదని, పెట్టుబడిదారుల విధానం అని ఆయన వివరించారు.
ఉదాహరణకు పదివేల మంది కష్టపడి ఒక అంశాన్ని నేర్చుకుంటే, దీనంతటినీ ఏఐ తక్షణమే నేర్చుకుంటుంది. ఏఐ తయారీ సంస్థలు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించేలా సాంకేతికతకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేశాయన్నారు. ఏఐ రాకతో ప్రారంభ దశలో నియమించుకునే గ్రాడ్యుయేట్ల ఎంపికలు తగ్గాయని, మున్ముందు పనిచేస్తున్న వారిని ఇంటికి పంపనున్నారని న్యూయార్క్ కు చెందిన ఫెడరల్ రిజర్వ్ సర్వేలో వెల్లడైంది. అయితే హెల్త్ కేర్ రంగంలో ఏఐ ప్రభావం అంతగా ఉండదన్నారు. ఈ రంగంలో డాక్టర్ల సమర్థత ఐదు రెట్లు పెరిగితే కాని తొలగింపులు ఉంటాయని, ఆ స్థాయిలో పెరుగుదల ఉండదన్నారు. ప్రస్తుతం ఏఐ వేగాన్ని గమనిస్తే 2026 తొలి నాళ్లలోనే నిరుద్యోగ సమస్య పెరుగుదలకు దారితీసే ప్రమాదముందన్నారు. ఉద్యోగాల విషయాన్ని పక్కనపెడితే అంతకన్నా భారీ ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. లాభాల వేటలో పరుగెత్తే కంపెనీలు రక్షణ నిబంధనలను విస్మరించే అవకాశముందన్నారు. ఏఐ తో మున్ముందు ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టమని, మంచి, చెడులు ఉన్నాయని హింటన్ అభిప్రాయపడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram