Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Feb 27, 2026 5:13 AM IST
Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనులు సఫలం అవుతాయి. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో సన్మాన సత్కారాలు పొందుతారు. వృత్తి పరమైన ప్రయాణానికి అవకాశం ఉంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మంచి అవకాశాలు చేజారుతాయి. కష్ట సమయంలో వివేకంతో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక నిర్ణయాల విషయంలో స్థిరత్వం అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. ఆర్థికపరంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. అనవసర ఖర్చులు నియంత్రించండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో దృఢ నిశ్చయంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ కలహాలు అశాంతి కలిగిస్తాయి. ఖర్చులు అదుపు చేయడం తప్పనిసరి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు ఈ రోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవబలంతో ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రోజు ప్రారంభించే పథకాలు, కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తినిపుణులు, ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు ఉంటాయి. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి లభించే ప్రోత్సాహం ఉత్సాహాన్నిస్తుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. వ్యాపారంలో కొత్త పనులు చేపట్టడానికి, భవిష్యత్ ప్రణాళికలు అమలు పరచడానికి అద్భుతమైన రోజు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సహచరుల ప్రోత్సాహం లభిస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే వ్యాపారంలో విశేష లాభాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబ కలహాలు రాకుండా కోపావేశాలు అదుపులో ఉంచుకోండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభసూచనలు గోచరిస్తున్నాయి. పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. సన్నిహితుల నుంచి కానుకలు అందుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నిదానంతో వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు సఫలం అవుతాయి. కుటుంబ కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలోచించి తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమావేశాలు, మేధోపరమైన చర్చల్లో పాల్గొంటారు. మీ నిర్ణయాలను అందరూ సమర్థిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనవసర ఖర్చులు ఉంటాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతతో మెలగాలి. క్రమశిక్షణ, సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రారంభించిన పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు, గొడవలు రాకుండా జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.