Oracle layoffs | ఉద్యోగులకు షాక్.. 30,000 మందిపై ఒరాకిల్ వేటు..?
Oracle layoffs | టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. టారిఫ్‌ల బాదుడు, ఏఐ ప్రవేశం వెరసి చిన్న కంపెనీల నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకూ అన్నీ పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపును చేపడుతున్నాయి. ఏటా వేలాది మందిపై వేటు వేస్తున్నాయి.
Oracle layoffs | టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. టారిఫ్‌ల బాదుడు, ఏఐ ప్రవేశం వెరసి చిన్న కంపెనీల నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకూ అన్నీ పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపును చేపడుతున్నాయి. ఏటా వేలాది మందిపై వేటు వేస్తున్నాయి.
ఇప్పటికే దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అమెజాన్, హెచ్‌పీ, యాపిల్, మెటా.. వంటి పెద్దపెద్ద సంస్థలు ఖర్చు తగ్గించుకునేందుకు ఎడాపెడా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle layoffs) కూడా ఉద్యోగులకు షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 30,000 మంది ఉద్యోగాల్ని తొలగించేందుకు సంస్థ సిద్ధమైనట్లు సమాచారం. ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణం ఓపెన్ఏఐ అని అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఓపెన్ ఏఐతో ఒప్పందమే
ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థతో ఒరాకిల్ 300 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. భారీగా డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టింది. ఇందుకు నిధుల అవసరం చాలా ఉంది. ఏఐ కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంస్థకు దాదాపు 156 బిలియిన్ డాలర్లు అవసరం ఉంది. అయితే, సంస్థకు కావాల్సిన నిధులు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా లేవు. అందుకే సంస్థ తన సొంతవనరులపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఫలితంగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
లేఆఫ్స్‌తో ఆదా..
ఈ లేఆఫ్స్‌తో 8 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేయొచ్చని సంస్థ భావిస్తోంది. ఏఐ కోసం సంస్థ తన ఉద్యోగులనే కాదు, కస్టమర్లను కూడా టార్గెట్ చేసింది. కొత్తగా వచ్చే కస్టమర్లు తమ ఫీజులో 40 శాతం ముందుగానే చెల్లించాలని షరతులు విధిస్తున్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram