Anil Ravipudi | వ‌చ్చే సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసిన అనీల్ రావిపూడి.. ఈ సారి మ‌ళ్లీ ఇద్ద‌రు హీరోల‌తో…!

Anil Ravipudi | టాలీవుడ్‌లో కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు స‌రికొత్త మార్గం చూపించిన దర్శకుడు అనిల్ రావిపూడి మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వరుస విజయాలతో ‘హిట్ మిషన్’గా పేరు తెచ్చుకున్న ఆయన, ఈసారి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువస్తూ సంచలన కాంబినేషన్‌ను సెట్ చేశారు.

  • By: sn |    movies |    Published on : Feb 27, 2026 7:31 AM IST
Anil Ravipudi | వ‌చ్చే సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసిన అనీల్ రావిపూడి.. ఈ సారి మ‌ళ్లీ ఇద్ద‌రు హీరోల‌తో…!

Anil Ravipudi | టాలీవుడ్‌లో కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు స‌రికొత్త మార్గం చూపించిన దర్శకుడు అనిల్ రావిపూడి మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వరుస విజయాలతో ‘హిట్ మిషన్’గా పేరు తెచ్చుకున్న ఆయన, ఈసారి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువస్తూ సంచలన కాంబినేషన్‌ను సెట్ చేశారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌ని ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేసిన అనిల్ రావిపూడి, తొలి ప్రయత్నంలోనే ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. ఆ తరువాత వరుసగా కమర్షియల్ హిట్స్ అందుకుంటూ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు.

ఇక విక్టరీ హీరో వెంకటేష్తో అనిల్ రావిపూడి కాంబినేషన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘F2: Fun and Frustration’, ‘F3: Fun and Frustration’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. అదేవిధంగా గత ఏడాది వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించి మరోసారి తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నిరూపించారు.

ఇప్పుడు ఈ విజయాల సరసన మరో క్రేజీ ప్రాజెక్ట్ జతకానుంది. 2027 సంక్రాంతిని టార్గెట్‌గా చేసుకుని అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబినేషన్‌లో కొత్త సినిమా తెరకెక్కనుంది. ముఖ్యంగా ఈసారి వెంకటేష్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా నటించనుండటం విశేషం. రీసెంట్‌గా విడుదల చేసిన స్పెషల్ వీడియో క్లిప్ ద్వారా ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘పటాస్’ తర్వాత కళ్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి చేయబోతున్న రెండో చిత్రం కావడం ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇద్దరు హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా హాస్యం, భావోద్వేగం, ఫ్యామిలీ ఎలిమెంట్స్ సమపాళ్లలో కలగలిపిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. కథ, స్క్రీన్‌ప్లే పనులు దాదాపు పూర్తి కాగా, నటీనటులు మరియు సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్, వెంకటేష్ సహజ నటన, కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్ అన్ఈ కలిసి బాక్సాఫీస్ వద్ద మరో సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2027 సంక్రాంతి రేసులో ఈ మల్టీస్టారర్ ఎలా సందడి చేస్తుందో చూడాలి!