లేఆఫ్స్‌కు కృత్రిమ మేధనే ప్రధాన కారణమా..? ఇందులో నిజమెంత..?
ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ (Layoffs) పర్వం కొనసాగుతోంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. గూగుల్, మెటా, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి. 2019 కరోనా తర్వాత ఆర్థిక మాంద్యం భయాలతో మొదలైన ఈ ప్రక్రియ.. ఇప్పటికీ కొనసాగుతోంది. గతేడాది కూడా లక్షలాది మంది ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. ఈ ఏడాది కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
విధాత: ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ (Layoffs) పర్వం కొనసాగుతోంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. గూగుల్, మెటా, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి. 2019 కరోనా తర్వాత ఆర్థిక మాంద్యం భయాలతో మొదలైన ఈ ప్రక్రియ.. ఇప్పటికీ కొనసాగుతోంది. గతేడాది కూడా లక్షలాది మంది ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. ఈ ఏడాది కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణం కృత్రిమ మేధ (AI) అని.. దాని కారణంగా ప్రముఖ సంస్థలు మానవ వినియోగాన్ని తగ్గించుకుంటున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ ఉద్యోగాలను మింగోస్తోందన్న భయాలు టెక్ ఉద్యోగుల్లో నెలకొంది. అయితే, ఉద్యోగాల కోతకు ఏఐ కారణం కాదని తాజా అధ్యయనంలో తేలింది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయన్నది కేవలం భ్రమ మాత్రమేనని.. అసలు కారణాలు వేరే ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ (Oxford Economics) స్పష్టం చేసింది. అమెరికాలో గత ఏడాది జరిగిన 1.25 లక్షల టెక్ ఉద్యోగాల కోతలో ఏఐ పాత్ర కేవలం 4.5 శాతమేనని వెల్లడించింది.
పలు సంస్థలు లేఆఫ్స్‌కు ఏఐని కారణంగా చూపుతున్నప్పటికీ.. అది వాస్తవం కాదని పేర్కొంది. ఉద్యోగాల కోతకు వృద్ధి మందగించడం, బలహీనమైన డిమాండ్, వ్యయ ఒత్తిళ్లు, కార్పొరేట్ పునర్నిర్మాణం వంటివి కారణమని అభిప్రాయపడింది. ఉద్యోగాల తొలగింపునకు ఏఐ కంటే మార్కెట్ ఒడిదుడుకులు, ఆర్థిక మందగమనమే 80 శాతం మేర కారణమని పేర్కొంది. శ్రామిక శక్తిని తగ్గించుకోవడం, ఖర్చు తగ్గింపు, మార్కెట్ అనిశ్చితి, మహమ్మారి అనంతరం చేపట్టిన అధిక నియామకాలను నిలిపివేయడం, ఆర్థిక ఒత్తిళ్ల వల్లే సంస్థలు ఉద్యోగాల తొలగింపు చేపడుతున్నట్లు తెలిపింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేసే ఆవిష్కరణ వ్యూహంలో భాగంగానే కంపెనీలు ఉద్యోగుల తొలగింపులకు ఏఐని కారణంగా చూపుతున్నాయని అభిప్రాయపడింది.
ఇదిలా ఉండగా.. ఐటీ రంగంపై ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ‘నాస్కామ్-ఇండీడ్’ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం టెక్ సంస్థల్లో 40 శాతం పనులు ఏఐ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వివిధ విభాగాల్లో 20 నుంచి 40 శాతం పనులు ఏఐ చేస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో 40 శాతానికి పైగా పనులు ఏఐ సహాయంతోనే జరుగుతున్నట్లు తెలిపింది. ఏది ఏమైనా టెక్ రంగంలో ఏఐ గుబులు మాత్రం తగ్గడం లేదు. ఏఐ వచ్చాక ఐటీ ఉద్యోగులు క్షణం క్షణం భయం భయంగా గడుపుతున్నారనే చెప్పాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram