Shivaji Raja | ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం.. తండ్రి జి. రామరాజు కన్నుమూత

Shivaji Raja | చిత్ర పరిశ్రమలో ఒకవైపు పెళ్లి సంబరాలు కొనసాగుతుండగా, మరోవైపు సెలబ్రిటీల ఇళ్లల్లో విషాదాలు అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి జి. రామరాజు మంగళవారం ఉదయం పరమపదించారు. 85 ఏళ్ల వయసున్న జి. రామరాజు మధురానగర్‌లోని తన నివాసంలో ఉదయం 8 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

  • By: sn |    movies |    Published on : Mar 03, 2026 12:04 PM IST
Shivaji Raja | ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం.. తండ్రి జి. రామరాజు కన్నుమూత

Shivaji Raja | చిత్ర పరిశ్రమలో ఒకవైపు పెళ్లి సంబరాలు కొనసాగుతుండగా, మరోవైపు సెలబ్రిటీల ఇళ్లల్లో విషాదాలు అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి జి. రామరాజు మంగళవారం ఉదయం పరమపదించారు. 85 ఏళ్ల వయసున్న జి. రామరాజు మధురానగర్‌లోని తన నివాసంలో ఉదయం 8 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. వయోభారం తో పాటు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి మృతి వార్తతో శివాజీ రాజా కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.

నేడు అంత్యక్రియలు

రామరాజు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు సందర్శించేందుకు నివాసంలో ఉంచారు. అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలలోపు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.

శివాజీ రాజా తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేరుగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తుండగా, మరికొందరు ఫోన్ ద్వారా ఓదార్పు అందిస్తున్నారు.

శివాజీ రాజా సినీ ప్రయాణం

1985లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన శివాజీ రాజా తన కెరీర్‌లో 260కు పైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఎం.వి. రఘు దర్శకత్వంలో రూపొందిన ‘కళ్ళు’ చిత్రంలో నటించి ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డును అందుకున్నారు.

‘పెళ్లి సందడి’, ‘సిసింద్రీ’, ‘ఘటోత్కచుడు’, ‘మురారి’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. టెలివిజన్ రంగంలో కూడా తనదైన ముద్ర వేసిన ఆయన, ‘అమృతం’ సీరియల్‌లో కొన్ని ఎపిసోడ్లలో ప్రధాన పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ‘సంబరాల రాంబాబు’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

బాల్యం, విద్యాభ్యాసం

1962 ఫిబ్రవరి 26న రామరాజు–చంద్రావతి దంపతులకు జన్మించిన శివాజీ రాజా, భీమవరంలో పెరిగారు. ఆయన తండ్రి అక్కడి డిఎన్ఆర్ కళాశాలలో అటెండర్‌గా పనిచేసేవారు. హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ పూర్తి చేసిన అనంతరం నటనలో శిక్షణ పొందారు. తరువాత కుటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లి, ఆపై మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి సినీ రంగంలో కొనసాగుతున్నారు. తండ్రి మృతి శివాజీ రాజా కుటుంబానికి తీరని లోటుగా మారింది. ఈ కఠిన సమయంలో కుటుంబానికి అభిమానులు అండగా నిలుస్తున్నారు.