Trump comments on Iran| ఇరాన్‌పై యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం: ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ పై యుద్దాన్ని మరింత తీవ్రతరం చేస్తాం అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని, ప్రపంచంలోనే అమెరికా అత్యంత శక్తివంతమైనదని స్పష్టం చేశారు.ఇరాన్‌లో చెత్తను ఏరివేస్తున్నామని అన్నారు. యుద్ధం మరో నాలుగైదు వారాలు కొనసాగవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Trump comments on Iran| ఇరాన్‌పై యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం: ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

విధాత : ఇరాన్ పై యుద్దాన్ని మరింత తీవ్రతరం చేస్తాం అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో యుద్దం మాకు బోర్ కొట్టదు అని, మా జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని, ప్రపంచంలోనే అమెరికా అత్యంత శక్తివంతమైనదని స్పష్టం చేశారు. ఇరాన్‌లో చెత్తను ఏరివేస్తున్నామని అన్నారు. యుద్ధం మరో నాలుగైదు వారాలు కొనసాగవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇరాన్‌ క్షిపణి సామర్థ్యాన్ని ధ్వంసం చేయడం, నౌకాదళాన్ని నాశనం చేయడం, అణ్వాయుధాలు తయారుచేయకుండా అడ్డుకోవడం మా లక్ష్యం అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వంలోని చాలా మంది సభ్యులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.. వేలాది మంది ఫోన్ కాల్స్ చేసి వేడుకుంటున్నారు.. ఖమేనీ చనిపోయినప్పుడు చాలామంది రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు అని ట్రంప్ తెలిపారు.

ఇరాన్‌పై త్వరలో మరిన్ని భీకర దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఇప్పటి వరకు తాము పెద్ద దాడులే చేయలేదన్నారు. అనుకున్నదాని కంటే ముందుగానే లక్ష్యాలను సాధిస్తున్నామని వెల్లడించారు. అరబ్‌ దేశాలపై ఇరాన్‌ దాడి చేయడం ఆశ్చర్యం కలిగించిందని ట్రంప్ అన్నారు.  24గంటల్లో మా దాడులు ఉదృతం చేయనున్న నేపథ్యంలో అమెరికా పౌరులు పశ్చిమాసియాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని యూఎస్‌ విదేశాంగశాఖ సూచించింది.

కొనసాగుతున్న ఇరాన్ ఎదురుదాడులు

అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఎదురుదాడులు కొనసాగిస్తుంది. బహ్రెయిన్‌లోని ప్రముఖ కార్యాలయాలు, భవనాలపై ఇరాన్ క్షిపణి దాడులు సాగించింది. సీనియర్ అమెరికన్ మిలిటరీ కమాండ్ సిబ్బంది నివసిస్తున్నట్లు భావిస్తున్న భవనాలపై దాడి చేసింది. అమెరికా మిత్రపక్ష దేశాలుగా ఉన్న యూఏఈ సహ జోర్డాన్, కువైట్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేస్తుంది. రియాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడి చేయడం జరిగింది. ఇరాన్ పార్లమెంట్‌పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. మరోవైపు పశ్చిమాసియా దేశాల నుంచి విదేశీయులు తమ దేశాలకు వెళ్లేందుకు ఆందోళనగా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. యుద్దం నేపథ్యంలో విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు ఆయా దేశాలలో మూతపడగా..దుబాయ్‌లో సూపర్ మార్కెట్లు ఖాళీ అయ్యాయి.

ఎల్ఎన్జీ ఉత్పత్తి నిలిపివేసిన ఖతార్ ఎనర్జీ

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఖతార్ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఖతార్ ఎనర్జీ సంస్థను మూసివేసింది. ఖతార్ ఉత్పత్తి నిలిపివేయడంతో యూరప్ లో 50 శాతం గ్యాస్ ధరలు పెరిగాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో  సౌదీలోని అరాంకో ఆయిల్ రిఫైనరీ మూత పడింది.  ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చమురు కొరతను ఎదుర్కొనుండటంతో  చమురు  ధరలు 40శాతం పెరిగాయి. ఇరాన్  హర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు రవాణకు భారీ ఆటంకం ఏర్పడింది.  ఇంధన కొరతను అధిగమించేందుకు ఆ దేశాలు ప్రత్యామ్యాయ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నాయి.