Ram Charan – Upasana | ట్విన్స్ రాకతో మెగా ఇంట హర్షం.. రామ్ చరణ్–ఉపాసన దాంపత్య ప్రయాణం మరోసారి హాట్ టాపిక్
Ram Charan - Upasana |మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతుల ఇంట మరోసారి సంతోష వాతావరణం నెలకొంది. ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో కొణిదెల కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. ఒక పాప, ఒక బాబు జన్మించడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.
Ram Charan – Upasana |మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతుల ఇంట మరోసారి సంతోష వాతావరణం నెలకొంది. ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో కొణిదెల కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. ఒక పాప, ఒక బాబు జన్మించడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. సోషల్ మీడియాలో చరణ్–ఉపాసన పేర్లు ట్రెండింగ్‌గా మారగా, సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకి ఒక కూతురు ఉన్న నేపథ్యంలో ట్విన్స్ రాక మెగా ఇంట సంతోషాన్ని తెచ్చిపెట్టింది. ఇక చరణ్–ఉపాసన దాంపత్యం టాలీవుడ్‌లో ఆదర్శ జంటగా చెప్పబడుతుంది. 2012లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ సమతుల్యంగా నడిపిస్తూ కెరీర్, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేస్తూ వస్తున్నారు.
స్నేహంగా ప్రారంభమైన పరిచయం క్రమంగా ప్రేమగా మారి పెళ్లి వరకు చేరిందని పలుమార్లు వారు చెప్పుకొచ్చారు. కుటుంబాల అనుమతితో జరిగిన ఈ వివాహం అప్పట్లో టాలీవుడ్‌లో ప్రధాన చర్చగా నిలిచింది.ఉపాసన అపోలో హాస్పిటల్స్ కుటుంబానికి చెందిన వారసురాలు కావడం విశేషం. వ్యాపార రంగం, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఆరోగ్యం, ఫిట్‌నెస్, సామాజిక సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో రాంచరణ్.. ఉపాసనతో తన లవ్ స్టోరీ గురించి రివీల్ చేశారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఉపాసనతో పరిచయం ఏర్పడింది అని చరణ్ బాలయ్యకి తెలిపారు. మొదట్లో మా మధ్య ఎప్పుడూ గొడవలు జరిగేవి.
కానీ కొంత కాలం తర్వాత ఆమెకి ఫిదా అయ్యా.. బహుశా ఆమె మంచి గుణం వల్ల ప్రేమలో పడ్డానేమో అంటూ రామ్ చరణ్ స్పష్టం చేశారు. ఉపాసనకు కూడా నాపై ఇష్టం ఉండేది కానీ నేను ప్రపోజ్ చేసే వరకు తాను ఎప్పుడు బయటపెట్టలేదు. ఈ క్రమంలో బాలకృష్ణ .. ఉపాసన, తన కుమార్తె బ్రాహ్మిణి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపారు. రాంచరణ్ స్పందిస్తూ అవును నాకు తెలుసు సార్.. వాళ్లిద్దరూ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు అని చెప్పుకొచ్చారు. ఇక మీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండండి, గాడ్ బ్లెస్ యు బోత్ అని బాలయ్య ఆశీర్వదించారు.
సినిమా రంగానికి నేరుగా సంబంధం లేకపోయినా, వివాహానంతరం సినీ వాతావరణానికి అలవాటు పడుతూ భర్తకు బలమైన మద్దతుగా నిలిచారు. మరోవైపు రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడిగా యాక్షన్, డ్యాన్స్, నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఒత్తిడులు, రూమర్లు, గాసిప్‌ల మధ్య కూడా ఈ జంట పరస్పర అవగాహనతో ముందుకు సాగడం అభిమానులను ఆకట్టుకుంటోంది. కుటుంబం, కెరీర్ రెండింటినీ సమానంగా చూసే ఈ జంటకు ట్విన్స్ జననం మరొక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. మెగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తుండగా, సినీ వర్గాలు కూడా ఈ సంతోషాన్ని పంచుకుంటున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram