Prakash Raj : గేమింగ్ యాప్ అనుకుని ప్రమోషన్ చేశాను..సారీ
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సిట్ (SIT) విచారణకు హాజరయ్యారు. తాను దాన్ని ‘గేమింగ్ యాప్’ అనుకునే ప్రమోట్ చేశానని, అది బెట్టింగ్ యాప్ అని తెలిసిన తర్వాత తప్పుకున్నానని తెలిపారు.
విధాత, హైదరాబాద్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ నేను గేమింగ్ యాప్ అనుకుని ప్రమోషన్ చేశానని,
బెట్టింగ్ యాప్ అని తెలిసిన తర్వాత తప్పుకున్నానని తెలిపారు. బెట్టింగ్ యాప్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయని, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.
బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ విషయమై తాను క్షమాపణలు చెబుతున్నానని..ఇందులో నాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నారు. బెట్టింగ్ యాప్స్ లో ఎందరో యువత నష్టపోవడం, చివరకు బలవన్మరణాలకు పాల్పడటం జరుగుతుందని, ఇలాంటి వాటికి అంతా దూరంగా ఉండాలన్ని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి నా బ్యాంకు లావాదేవిలను అధికారులు గతంలోనే పరిశీలించారని, యాప్స్ ద్వారా తాను ఎలాంటి అక్రమ ఆదాయం పొందలేదని వెల్లడైందని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram