Actor Shivaji : నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు
నా వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒక తండ్రిలా సూచనలు చేస్తే నన్ను టార్గెట్ చేసి కుట్రలు చేశారని నటుడు శివాజీ మహిళా కమిషన్ విచారణ అనంతరం ఆవేదన వ్యక్తం చేశారు.
విధాత, హైదరాబాద్ : మహిళల పట్ల, వారి డ్రెస్సింగ్ పట్ల చేసిన వ్యాఖ్యలపై నేను మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చానని..నా ఉద్దేశం ఏంటో మహిళా కమిషన్ కి చెప్పానని నటుడు శివాజీ వెల్లడించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నేను చేసిన వ్యాఖ్యల్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని, ఎవర్నీ ఇబ్బంది పెట్టాలని నేను మాట్లాడలేదు అని స్పష్టం చేశారు.
కమిషనర్ చైర్ పర్సన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పానన్నారు. మంచి చెప్పే క్రమంలో కొన్ని మాటలు తూలానని..దానికి ఇప్పటికే క్షమాపణలు చెప్పానని గుర్తు చేశారు. ఇక ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేద్దాం అని చెప్పడం జరిగిందని శివాజీ తెలిపారు. తాను ఓ నటికి ఎదురైన జరిగిన సంఘటన చూసి ఆ మాటలు చెప్పడం జరిగిందని కమిషన్ కు వివరించానన్నారు. ఇకపై మహిళల విషయంలో చులకనగా మాట్లాడబోనని తెలిపారు.
స్త్రీ లేకపోతే ప్రపంచం లేదని, మానవాళి లేదని..స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలని వారిఇష్టం అని, నేను నా బిడ్డలకు చెప్పినట్లుగా ఏదో సూచన చేశానన్నారు. దానిపై నన్ను లక్ష్యంగా చేసుకుని జూమ్ మీటింగ్ లు పెట్టుకుని మరి కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై సలహాలు, సూచనలు, మంచి మాటలు చెప్పొద్దని నాకిప్పుడు అర్థమైంది అన్నారు. యదార్ధ వాది లోక విరోధి అని వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్, నాగబాబు వ్యాఖ్యలను నేను చూడలేదన్నారు. కొందరు నాతో పాటే ఇండస్ట్రీలో కెరీర్ మొదలు పెట్టిన వారు, నాతో ముందు మంచిగా ఉన్నవారు..నా వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని నాపై కుట్రలకు తెరలేపారన్నారు. నేను ఏం తప్పు చేశాను..? నాపే ఎందుకంత ద్వేషం అని శివాజీ ప్రశ్నించారు. ఓ తండ్రిలా హీరోయిన్లకు సూచన చేశానని, ఎవరు ఎలాంటి బట్టలు వేసుకుంటే నాకేంటి?
గతంలో ఎవరూ ఏమీ అనలేదా..? వాళ్ల మీద ఇలాగే కంప్లైంట్ లు ఇచ్చారా? అని శివాజీ నిలదీశారు. నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదని, విలువలతో బతికేవాడినని, వ్యవస్థలను, పరిశ్రమను గౌరవిస్తానన్నారు. బతకడం కోసం దిగజారే వ్యక్తిని కాదన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram