• Telugu News
  • /National

Phone Battery Explosion | బాలుడి నోట్లో పేలిన ఫోన్ బ్యాట‌రీ.. షాకింగ్ వీడియో

ఓ యువ‌కుడి నోట్లో ఫోన్ బ్యాట‌రీ (Phone Battery) పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంట‌లు వ్యాపించాయి. ఈ ఘ‌ట‌న‌లో బాలుడి నోరు, త‌ల భాగంలో తీవ్ర గాయాల‌య్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 07, 2026, 4:55 pm IST
Read Time: 4 mins
Phone Battery Explosion | బాలుడి నోట్లో పేలిన ఫోన్ బ్యాట‌రీ.. షాకింగ్ వీడియో

Phone Battery Explosion | సెల్ ఫోన్లు (mobile phones) ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా వాటిలో ఉండే లిథియం బ్యాట‌రీ పేలితే ప్రాణాల‌కే ప్ర‌మాదం. తాజాగా ఓ యువ‌కుడి నోట్లో ఫోన్ బ్యాట‌రీ (Phone Battery) పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంట‌లు వ్యాపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

సెల్‌ఫోన్ రిపేర్ సెంట‌ర్‌కు వెళ్లిన బాలుడు అక్క‌డ ఉన్న బ్యాట‌రీని తీసుకున్నాడు. అంత‌టితో ఆగ‌కుండా దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అంతే ఇంకేముంది అది ఒక్క‌సారిగా భారీ శ‌బ్దంతో పేలింది (Phone Battery Explosion). అనంత‌రం పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఈ పేలుడుతో దుకాణంలోని వారు భ‌యంతో ప‌రుగులు తీశారు. ఈ ఘ‌ట‌న‌లో బాలుడి నోరు, త‌ల భాగంలో తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు అత‌డిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

నిపుణుల సూచ‌న‌లు..

మొబైల్‌లో లిథియం-అయాన్ బ్యాటరీలను ఉప‌యోగిస్తారు. వీటిని స్మార్ట్‌ఫోన్లు, ఎల‌క్ట్రానిక్ డివైజ్‌ల‌లో అధిక శ‌క్తి కోసం వినియోగిస్తుంటారు. ఇతర బ్యాటరీల మాదిరి కాకుండా లిథియం బ్యాటరీలు పవర్ ఫుల్ గా ఉంటాయి. చాలా ప్ర‌మాద‌క‌రం. అవి అత్య‌ధిక వేడి ఉన్నప్పుడు ఒక్క‌సారిగా పేలిపోతాయి. దీంతో స్మార్ట్ ఫోన్ల‌లో వాడే బ్యాట‌రీల విష‌యంలో జాగ్ర‌త్తగా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌లే కాలంలో ప్యాంటు జోబుల్లో ఫోన్లు పేలుతున్న ఘ‌ట‌న‌లు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఉన్న‌ట్టుండి ఫోన్లు పేలుతుండ‌టంతో వినియోగ‌దారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Crocodile Spotted In Godavari River : గోదావరి ఒడ్డుకు మొసళ్లు..పాపికొండల పర్యాటకులకు టెన్షన్ !
Feeding Pigeons | పావురాల‌కు దాణా వేసి కోర్టు ఆగ్ర‌హానికి గురైన భార‌త సంత‌తి వృద్ధురాలు.. భారీ ఫైన్‌