Crocodile Spotted In Godavari River : గోదావరి ఒడ్డుకు మొసళ్లు..పాపికొండల పర్యాటకులకు టెన్షన్ !

గోదావరి నది ఒడ్డున మొసళ్లు సేద తీరుతున్న దృశ్యాలు పాపికొండల పర్యాటకుల్లో భయాందోళన కలిగించాయి. అధికారులు నదిలోకి దిగవద్దని హెచ్చరించారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Feb 07, 2026, 4:11 pm IST
Read Time: 2 mins
Crocodile Spotted In Godavari River : గోదావరి ఒడ్డుకు మొసళ్లు..పాపికొండల పర్యాటకులకు టెన్షన్ !

విధాత : గోదావరి నదిలోని మొసళ్లు నది ఒడ్డున సేద తీరుతున్న దృశ్యాలు పాపికొండ పర్యాటకులను భయపెట్టాయి. పోలవరం జిల్లా వి.ఆర్.పురం మండలం పోచవరం బోటింగ్ పాయింట్ గోదావరి నది తీరంలో మొసళ్లు కనిపించాయి. ఫెర్రీ పాయింట్ వద్ద గోదావరి నది ఒడ్డున ఇసుక తిన్నెలపై సేద తీరుతున్న మొసలిని పాపి కొండల విహార యాత్రకు వచ్చిన పర్యాటకులు చూశారు.

వెంటనే వారు స్థానిక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి అలికిడికి ఓ చిన్న మొసలి నదిలోని నీటిలోకి వెళ్లిపోగా..మరో మొసలిని మాత్రం స్థానికులు తాళ్లతో బంధించి దూరంగా నదిలోకి విడిచిపెట్టారు. గోదావరిలోకి ఎవరూ దిగవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి :

బ్యాక్ లాగ్ పోస్టులను అమ్ముకునే కుట్ర : కవిత తీవ్ర ఆరోపణలు
Raja Saab | ఓటీటీలోనూ ‘రాజా సాబ్’కి రిలీఫ్ లేదు… ట్రోల్స్‌తో మళ్లీ హాట్ టాపిక్!