మొసలిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు!

ఓ యువకుడు ఏకంగా మొసలిని భుజాన వేసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఘటన వైరల్ గా మారింది. తన పొలంలో మొసలి సంచారంపై అందించిన సమాచారం పట్ల అటవీ అధికారులు స్పందించకపోవడంతో తనే ఆ మొసలిని బంధించి భుజాన వేసుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Aug 02, 2026, 12:45 pm IST
Read Time: 3 mins
మొసలిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు!

విధాత : ఓ యువకుడు ఏకంగా మొసలిని భుజాన వేసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఘటన వైరల్ గా మారింది. బీహార్‌లోని సుపాల్ జిల్లాలో ఓ యువ రైతు తన పొలంలో మొసలి సంచారం సమాచారాన్ని అటవీ అధికారులకు అందించాడు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో తిక్క రేగిన ఆ యువ రైతు అమిత్ కుమార్ తానే స్వయంగా మొసలిని తాళ్లతో కట్టేసి బంధించాడు. దాని నోటికి తాళ్లు కట్టి బంధించి..స్వయంగా మొసలిని తన భుజాలపై మోస్తూ రోడ్డుపై నడుచుకుంటూ నేరుగా అటవీ శాఖ కార్యాలయానికి వెళ్లాడు.

అక్కడ అధికారులు స్పందించకపోవడంతో, అతడే మొసలిని తీసుకుని భీమ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. అనంతరం అటవీ శాఖ అధికారులు ఆలస్యంగా మేల్కొని మొసలిని స్వాధీనం చేసుకుని నదిలో వదిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు బీహారీలకు ఏదైనా సాధ్యమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.