Raja Saab | ఓటీటీలోనూ ‘రాజా సాబ్’కి రిలీఫ్ లేదు… ట్రోల్స్‌తో మళ్లీ హాట్ టాపిక్!
Raja Saab |పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పండగ సీజన్ అడ్వాంటేజ్‌తో వీకెండ్ వరకు కొంతవరకు కలెక్షన్లు రాబట్టినా, భారీ బడ్జెట్ కారణంగా అవసరమైన స్థాయిలో రికవరీ సాధించలేకపోయింది.
Raja Saab |పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పండగ సీజన్ అడ్వాంటేజ్‌తో వీకెండ్ వరకు కొంతవరకు కలెక్షన్లు రాబట్టినా, భారీ బడ్జెట్ కారణంగా అవసరమైన స్థాయిలో రికవరీ సాధించలేకపోయింది. రోజుకు కోటి రూపాయలకంటే తక్కువ కాకుండా షేర్ వచ్చినా కూడా మొత్తం వసూళ్లు ఆశించిన స్థాయిని అందుకోలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
థియేటర్ల రన్ ముగిసిన వెంటనే సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన వెంటనే ప్రభాస్ అభిమానులు భారీగా చూడటానికి ఎగబడటంతో సర్వర్లు కూడా కొన్ని గంటలపాటు స్లో అయ్యాయని సమాచారం. అయితే డిజిటల్ రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో సినిమా పై విమర్శలు, ట్రోల్స్ వెల్లువెత్తాయి.ప్రత్యేకంగా ప్రభాస్ డూప్ వాడినట్లు కనిపించే సన్నివేశాలు, గ్రాఫిక్స్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇతర హీరోల అభిమానులు స్క్రీన్‌షాట్లు, వీడియోలతో ఈ విషయాలను ట్రెండ్ చేయడంతో సినిమా మరోసారి చర్చనీయాంశమైంది.
ఈ ట్రోల్స్‌ను ప్రభాస్ అభిమానులు కూడా బలంగా డిఫెండ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంత భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదంటూ దర్శకుడు మారుతిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది “రాధే శ్యామ్, ఆదిపురుష్ కంటే కూడా ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌కు ఎక్కువ డ్యామేజ్ తెచ్చింది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు మేకర్స్ ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. థియేటర్లలో లేని అదనపు సీన్స్ ఉంటాయని చెప్పినా, దీనిపైనా నెటిజన్లు సెటైర్లు వేయడం గమనార్హం.
సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.200 కోట్లకు పైగా మాత్రమే వసూలు చేయగలిగింది. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పలేదు. కథ, కథనం, విజువల్స్, నటనపై కూడా మిశ్రమ స్పందనే రావడంతో సినిమా పరిస్థితి మారలేదు. మొత్తంగా ‘రాజా సాబ్’ థియేటర్లలోనే కాదు, ఓటీటీలో కూడా ట్రోల్స్ కారణంగానే ఎక్కువగా హైలైట్ అవుతూ ప్రభాస్ కెరీర్‌లో మరో నిరాశగా మిగిలిపోయింది.
bus ekke mundhu full beard, dhigetappatiki trimmed
dhaarilo dhaaba deggara shave cheskunnaadentraa @DirectorMaruthi pic.twitter.com/3yLgPXoNwv— 23 (@santhoshtweetzs) February 6, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram