ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫౌజీ’ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 3న ‘ఫౌజీ’ విడుదల కానున్నట్లు తెలుపుతూ చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్ పంచుకుంది. ‘అజ్ఞాతపర్వం ముగిసింది.. ఇక తిరుగుబాటు మొదలైంది..’ అంటూ పంచుకున్న ఆ పోస్టర్‌లో ‘1932 నుంచి మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు’ అని రాసి ఉన్న స్టాంప్ ఆకట్టుకుంటోంది. ఒంటి నిండా రక్తంతో, తుపాకీపై చేయి పెట్టి కూర్చొని ఉన్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. పోస్టర్ లో ప్రభాస్ గత చిత్రాలకు భిన్నంగా వినూత్నంగా కొత్త లుక్ లో కనిపించాడు. ఫౌజీలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రభాస్ ఫౌజీ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొత్తం ఆరు భాషల్లో రిలీజ్ కానుంది. ‘సీతారామం’ తర్వాత ఫౌజీ కథను రాయడానికే సుమారు ఏడాదికి పైగా సమయం పట్టిందని గతంలో హను రాఘవపూడి తెలిపారు. ప్రేక్షకులు తప్పకుండా సర్‌ప్రైజ్ ఫీలవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమా నుంచి త్వరలోనే ఓ లిరికల్ సాంగ్‌ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.