యూట్యూబ్‌లో.. దూసుకెళుతున్న‌ ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’

పెద్ద నిర్మాణ సంస్థలు, స్టార్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే మంచి సినిమాలు తెరకెక్కించవచ్చని మరోసారి నిరూపించింది 'భాగ్యనగరంలో సారథి ప్రేమ' చిత్రం.

Reported by: raj | వినోదం | Jul 16, 2026, 11:22 am IST
Read Time: 5 mins
యూట్యూబ్‌లో.. దూసుకెళుతున్న‌ ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’

పెద్ద నిర్మాణ సంస్థలు, స్టార్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే మంచి సినిమాలు తెరకెక్కించవచ్చని మరోసారి నిరూపించింది ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ చిత్రం. కేవలం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువ దర్శకుడు రంగుభుక్త రాము తన కలను నిజం చేసుకునేందుకు దాదాపు ఏడాదిన్నర పాటు శ్రమించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాతలు అంగా రెడ్డి భరత్ రెడ్డి, భరత్ గౌడ్ కూడా కొత్తవారే అయినప్పటికీ.. వారికీ ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ చిత్రంలో ప్రిన్స్ వంశీ, నిక్కీ చారి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రత్యేక పాత్రలో ఐవీడీ సాయి కనిపించగా.. నితిన్, చోటు, వినయ్, రాజా, హరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథకు తగ్గట్టుగా ప్రతి నటుడు తన పాత్రకు న్యాయం చేయడంతో సినిమా మరింత సహజంగా అనిపిస్తుంది. సినిమాకు రామయ్య చెంబోలు కథను అందించగా.. శ్రావణ్ కుప్పిలి సంభాషణలు, అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. సంగీత దర్శకుడు సంపత్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. పవన్ కొంబత్తుల రాసిన సాహిత్యం కూడా ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ కోమటి సినిమాటోగ్రఫీ, భాను అసిస్టెంట్ డీవోపీగా చేసిన పని, గీవన్ జీఆర్ ఎడిటింగ్ సినిమాకు మంచి నాణ్యతను తీసుకొచ్చాయి.

హైదరాబాద్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కేవలం 10 రోజుల్లో 1 గంట 10 నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని పూర్తి చేయడం విశేషం. సినిమా అవుట్‌పుట్‌పై నమ్మకంతో ఇటీవల ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అదే ఉత్సాహంతో ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యువత భావోద్వేగాలు, ప్రేమ, స్నేహం, జీవిత పోరాటాలను హృదయానికి హత్తుకునేలా ఈ సినిమాలో చూపించారు. కొత్తవారి ప్రతిభను ప్రోత్సహించాలనుకునే ప్రతి సినీ అభిమాని తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది.

కొత్త టాలెంట్స్ ని ప్రోత్సహించడమే తమ లక్ష్యం అని నిర్మాత అంగా రెడ్డి భరత్ రెడ్డి, వాల్దాస్ భరత్ గౌడ్ తెలిపారు. రాబోయే 5-10 సంవత్సరాలలో మరెన్నో చిత్రాలు నిర్మించడమే తమ లక్ష్యంగా నిర్మాతలు పెట్టుకున్నారు.