Prabhas | ప్రభాస్ డ్రీమ్ ప్రాజెక్ట్.. హైదరాబాద్‌లో రూ.160 కోట్ల స్థలంలో అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు. బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు సృష్టిస్తున్న డార్లింగ్.. వ్యక్తిగత జీవితంలో కూడా తన స్థాయికి తగ్గ లైఫ్‌స్టైల్‌ను నిర్మించుకుంటున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు. బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు సృష్టిస్తున్న డార్లింగ్.. వ్యక్తిగత జీవితంలో కూడా తన స్థాయికి తగ్గ లైఫ్‌స్టైల్‌ను నిర్మించుకుంటున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ హైదరాబాద్‌లో అత్యంత ప్రీమియం ప్రాంతాల్లో ఒకటైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో భారీ లగ్జరీ మ్యాన్షన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దాదాపు రెండేళ్ల క్రితమే ప్రభాస్ ఓ వ్యూహాత్మక ప్రణాళికతో రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఒక ఎకరం భూమి ధర సుమారు రూ.80 కోట్ల వరకు పలుకుతుండటంతో, కేవలం భూమి కొనుగోలుకే దాదాపు రూ.160 కోట్ల భారీ పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే ఈ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని, అలాగే నిర్మాణానికి అవసరమైన అనుమతులు కూడా లభించాయని సమాచారం. దీంతో ఇప్పుడు నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఈ ప్రాపర్టీ ఉండటంతో, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ వంటి కీలక ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉండనుంది.
ఈ కొత్త మ్యాన్షన్‌ను కేవలం ఇల్లు మాదిరిగా కాకుండా, ఒక మినీ రిసార్ట్ తరహాలో డిజైన్ చేస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. అత్యాధునిక ఇంటీరియర్స్‌తో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందులో ఏర్పాటు చేయనున్నారట. ప్రభాస్ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా హైఎండ్ ఫిట్‌నెస్ సెంటర్, ప్రైవేట్ మినీ థియేటర్, ఆధునిక సౌండ్ సిస్టమ్స్, లగ్జరీ స్విమ్మింగ్ పూల్, భారీ గార్డెన్ ఏరియా వంటి ప్రత్యేక సదుపాయాలు ఉండనున్నట్లు ప్రచారం సాగుతోంది.
అంతేకాకుండా, గోప్యతకు పెద్దపీట వేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ వ్యక్తిగత జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని ప్రశాంతమైన వాతావరణంతో పాటు అత్యాధునిక భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరించుకుంటూ, మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అడుగులు వేస్తున్నారని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ మ్యాన్షన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram