చూడటానికి ఓ పొడవైన పాము అదే పనిగా మెలికలు తిరుగుతూ కనిపిస్తుంది. నిశితంగా గమనిస్తే అక్కడ రెండు పాములు ఉన్నాయన్న సంగతి అవగతమవుతుంది. రెండు పాముల మధ్య సాగిన పోరాటం ఓ పొడవైన పామును తలపించిన వీడియో వైరల్ గా మారింది.
ఓ తోటలో రెండు పాములు పరస్పరం ఎదురుపడి ప్రత్యర్థిని ఆహారంగా మింగేయాలని ప్రయత్నించాయి. ఈ క్రమంలో రెండు పాములు పోరాటానికి దిగాయి. ఓ పామును మరో పాము నోట కరుచుకోగా దాని పట్టు నుంచి విడిపించుకునేందుకు బాధిత పాము తీవ్రంగా మెలికలు తిరగడం ఆరంభించింది. అయితే తన నోటి పట్టు నుంచి బాధిత పాము తప్పించుకోకుండా ఆ పాము కూడా దానితో పాటు మెలికలు తిరుగ సాగింది. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన రైతు ఆ పాముల పోరాటాల దృశ్యాలను తన సెల్ ఫోన్ లో బంధించాడు.
మొదట అదంతా ఒకే పొడవైన పాముగా భావించిన రైతు..చివరకు రెండు పాములు అక్కడ పోరాడుతున్నాయని గ్రహించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం అందులో తొలుత ఒకే పొడవైన పాము ఉందని భావించారు. అయితే వీడియో సాగుతున్న కొద్ది అక్కడ రెండు పాములు పోరాడుతున్నట్లుగా గ్రహిస్తుండటంతో ఇది వైరల్ గా మారింది.
ఈ స్నేక్ ఫైట్ చూస్తే కొన్ని సెకన్ల పాటు ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది!
అసలు ఏం జరుగుతుందో అర్థం కావడానికి కాస్త సమయం పడుతుంది.
ఊహించని రేంజ్లో ఉన్న ఈ సీన్ మాత్రం మిస్ అవ్వొద్దు!
🎥 Video Credit: Original Creator#Snake #SnakeFight #Wildlife #Nature #ViralVideo pic.twitter.com/CEA77tLMO4
— TeluguBulletin.com (@TeluguBulletin) July 16, 2026